MI Vs DC 2024: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటివరకు 19 మ్యాచ్ లు పూర్తయ్యాయి. కానీ ఈ సీజన్లో అత్యంత దారుణంగా ఆడుతున్న రెండు జట్లు ఏవైనా ఉన్నాయంటే.. ఒకటి ముంబై, రెండు ఢిల్లీ.. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఒక్క విజయాన్నయినా సాధించింది గాని.. ముంబై మాత్రం ఒక్క గెలుపును కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ రెండు జట్లు పాయింట్లు పట్టికలో 9, 10 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు ఆదివారం సాయంత్రం మూడు గంటల 30 నిమిషాల నుంచి తలపడతాయి. రెండవ గెలుపుతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఢిల్లీ.. ఈ మ్యాచ్ లో గెలిచి తొలి విజయాన్ని నమోదు చేయాలని ముంబై పట్టుదలతో ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం జరిగే మ్యాచ్ ఉత్కంఠ గా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. హ్యాట్రిక్ ఓటములతో ముంబై జట్టుకు జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. దీంతో ఆ జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ కూడా ఇలాంటి ఒత్తిడినే ఎదుర్కొంటున్నాడు. ఈ మ్యాచ్లో గెలుపు ఆ జట్టుకు అత్యంత అవసరం.
ముంబై
బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ.. ఈ జట్టులో సానుకూలతలకంటే ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టీం ఓపెనింగ్ బాగోలేదు. రాజస్థాన్ జట్టుపై జరిగిన మ్యాచ్లో పూర్వ కెప్టెన్ రోహిత్ శర్మ డక్ ఔట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ పెద్దగా రాణించడం లేదు. నమన్, బ్రేవిస్ నిలకడగా ఆడటం లేదు. తిలక్ వర్మ టచ్లోకి వచ్చినప్పటికీ.. అతడి స్థాయికి తగ్గట్టుగా ఇన్నింగ్స్ ఆడటం లేదు. హార్దిక్ పాండ్యా కీలక సమయంలో అవుట్ అవుతున్నాడు. మ్యాచ్ ఫినిషింగ్, బౌలింగ్లో అతడు విఫలమవుతున్నాడు. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆకాష్ మద్వాల్, బుమ్రా బౌలింగ్ జట్టుకు కాస్త రిలీఫ్ ఇస్తోంది. మిగతా బౌలర్లు మొత్తం విపరీతంగా పరుగులు ఇస్తున్నారు.
ఢిల్లీ
ఈ జట్టు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్లు ఆడింది. మూడింట్లో ఓడిపోయింది.. గత మ్యాచ్లో కోల్ కతా చేతిలో 106 పరుగుల తేడాతో దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. కోల్ కతా మ్యాచ్ పక్కన పెడితే.. మిగతా మూడిట్లో ఢిల్లీ ఆట తీరు పర్వాలేదు. కోల్ కతా మీద జరిగిన మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. బ్యాటింగ్లో కెప్టెన్ రిషబ్ పంత్, రెడ్ హాట్ ఫామ్ లో ఉన్నారు. ట్రిస్టన్ స్టబ్స్ టచ్ లోకి వచ్చాడు. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా వారి పూర్వపు లయ అందుకుంటే ఢిల్లీ జట్టుకు తిరుగుండదు. అయితే మీ అయితే మిచెల్ మార్ష్ తన స్థాయికి తగ్గట్టుగా ఆడడం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న కులదీప్ యాదవ్ ఇంకా కోలుకోలేదు. దీంతో బౌలింగ్లో ఢిల్లీ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
గెలుపు ఎవరిదంటే
రెండు జట్ల బలాలు పరిశీలిస్తే ఈ మ్యాచ్లో ముంబై గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. వరుస ఓటములతో విమర్శలు ఎదుర్కొంటున్న ముంబై జట్టు ఈ మ్యాచ్ తో బోణి కొడుతుందని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య 33 మ్యాచ్ లు జరిగాయి.. ఢిల్లీ 15 సార్లు, ముంబై 18సార్లు గెలిచాయి. ఢిల్లీ జట్టు కూడా బలంగానే కనిపిస్తున్నప్పటికీ ఒత్తిడిలో ముంబై మరింత కసిగా ఆడుతుంది.. అలాంటప్పుడు ముంబై జట్టును నిలువరిస్తేనే ఢిల్లీకి విజయం దక్కుతుంది.
జట్ల అంచనా ఇలా
ముంబై
కిషన్ కిషన్(వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, గెరాల్డ్, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్, బుమ్రా, మఫాకా.
ఢిల్లీ
రిషబ్ పంత్ కెప్టెన్, వికెట్ కీపర్, అక్షర్ పటేల్, డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మార్ష్, నోకియా, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, స్టబ్స్, రసిఖ్ దార్ సలామ్.