MI Vs CSK: ఎంత ప్రాణ స్నేహితుడైనా సరే.. మన పక్క బెంచ్మెంట్ అయినా సరే.. మనకంటే ఎక్కువ మార్కులు సాధిస్తే కాస్త అసహనం ఉంటుంది. ప్రౌడ వయసులోనే కాదు.. యుక్త వయసులోనే కాదు.. అంతకుమించిన వయసులోనూ ఇలాంటి జెలసి అనేది కచ్చితంగా ఉంటుంది. మామూలు మనుషులకే కాదు.. డెమీ గాడ్స్ గా పేరు ప్రఖ్యాతలు పొందుతున్న క్రికెటర్లకు కూడా ఇలాంటి భావన ఉంటుంది.
సరిగ్గా ఏడాది క్రితం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా (Hardik Pandya) వచ్చాడు. 2022 సీజన్లో గుజరాత్ జట్టుకు ఐపీఎల్ ట్రోఫీ అందించినట్టుగా.. ముంబై ఇండియన్స్ కు అందించలేకపోయాడు..
Also Read: రాజస్థాన్ కే కాదు మిగతా 8 జట్లకూ SRH హెచ్చరిక ఇది.
హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ జట్టులో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముంబై ఇండియన్స్ జట్టు నుంచి కెప్టెన్ గా రోహిత్ శర్మ(Rohit Sharma) ను పక్కనపెట్టి.. హార్దిక్ పాండ్యాను తీసుకోవడం పెను ప్రకంపనలకు దారితీసింది. దీంతో ముంబై ఇండియన్స్ జట్టు రెండు ముక్కలుగా విడిపోయింది. హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని ముంబై ఇండియన్స్ జట్టులో కొంతమంది ఆటగాళ్లు స్వాగతించలేదు. అక్కడిదాకా ఎందుకు హార్దిక్ పాండ్యా ను కెప్టెన్ ను చేయడం పట్ల రోహిత్ శర్మ సతీమణి సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆ తర్వాత ఆ పోస్టులను డిలీట్ చేసింది. గత సీజన్లో హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని నిరసిస్తూ ముంబై ఆడిన ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ అభిమానులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసేవారు. ఫ్ల కార్డులను.. ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ హార్దిక్ పాండ్యాను చులకన చేసే మాట్లాడేవారు. కొన్ని సందర్భాల్లో అయితే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ అభిమానులు పరస్పరం కొట్టుకున్నారు. కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే గత సీజన్లో ముంబై జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. వాస్తవానికి బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో మిగతా జట్ల కంటే ముంబై అత్యంత బలమైనది. అయినప్పటికీ తన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయింది. ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై జట్టు అలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు.
రోహిత్ మర్చిపోలేదా..
ఇక తాజా సీజన్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా తలపడుతోంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు లాస్ అయి 155 రన్స్ స్కోర్ మాత్రమే చేసింది.. వాస్తవానికి ముంబై జట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో 200 పైగా పరుగులు చేయాలి. కానీ అది సాధ్యం కాలేదు. చిదంబరం స్టేడియం కంటే కఠినంగా ఉన్న మైదానాలపై ముంబై ఇండియన్స్ జట్టు భారీగా పరుగులు చేసిన ఉదంతాలు కోకొల్లలు. కానీ ముంబై జట్టు గతాన్ని మర్చిపోయి.. ఇప్పుడొక అనామక జట్టు లాగా ఆట తీరు ప్రదర్శించింది. అన్నిటికంటే ముఖ్యంగా ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 0 పరుగులకు అవుట్ కావడం అతని అభిమానులను సైతం దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. గత సీజన్లోను రోహిత్ శర్మ చెప్పుకోదగ్గ ఆట తీరు ప్రదర్శించలేదు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ రోహిత్ అదరగొట్టాడు. అంతకుముందు ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో సెంచరీ చేసి వావ్ అనిపించాడు. అయితే అలాంటి రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డక్ అవుట్ కావడం షాక్ కు గురిచేస్తోంది. అయితే హార్దిక్ పాండ్యాను కెప్టెన్ ను చేయడం పట్ల రోహిత్ శర్మ గత సీజన్ నుంచి ఆగ్రహం గానే ఉన్నాడు. కాకపోతే ఆ విషయాన్ని నేరుగా బయట పెట్టడం లేదు. ప్రస్తుత ఐపిఎల్ సీజన్ ప్రారంభానికి అంటే ముందు జరిగిన మెగా వేలంలో రోహిత్ బయటికి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అతడిని ముంబై జట్టు రిటైన్ చేసుకుంది. ముంబై జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకున్నప్పటికీ.. రోహిత్ మనసులో బాధ అలాగే ఉండిపోయింది. అందువల్లే అతడు తన స్థాయికి కాకుండా.. అనామక ఆటగాడిలా ఆడుతున్నాడు. మరీ దారుణంగా 0 పరుగులకు అవుట్ అయిపోయి విమర్శల పాలవుతున్నాడు.