MI Vs CSK
MI Vs CSK: ఐపీఎల్ లో చెన్నై, ముంబై జట్లు అత్యంత బలమైనవిగా ఉన్నాయి. ఈ రెండు జట్లు చెరి ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకొని.. సంయుక్తంగా ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాయి.. 2023లో ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. గత సీజన్లో ఆశించినంత స్థాయిలో ఆట తీరు ప్రదర్శించలేదు. ఇక ముంబై ఇండియన్స్ గత సీజన్లో గ్రూప్ దశ నుంచే ఇంటిదారి పట్టింది.. చెన్నై, ముంబై జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. చెన్నై జట్టుకు పేరుకు రుతు రాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) కెప్టెన్సీ వహిస్తున్నప్పటికీ.. వెనకనుంచి కథ మొత్తం నడిపించేది మహీంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) అనడంలో ఎటువంటి సందేహం లేదు. 41 సంవత్సరాల ధోని ఇప్పటికి చురుకుగానే ఉన్నాడు. యువ ఆటగాళ్లకు పోటీ ఇస్తున్నాడు. కీపింగ్ లో అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పుతున్నాడు. ఆండ్రే సిద్ధార్థ్, డేవిడ్ కాన్వే, రుతు రాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, రవీంద్ర జడేజా, ధోని, శివం దూబే, షేక్ రషీద్ వంటి వారితో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. రవీంద్ర జడేజా, సామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్ వంటి వారు తమ స్పిన్ బౌలింగ్ తో మాయాజాలాన్ని ప్రదర్శించగలరు. ఖలీల్ అహ్మద్, మతీష పతిరణ, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్ వంటి వారితో పేస్ బౌలింగ్ కూడా పటిష్టంగా కనిపిస్తోంది.. తొలి మ్యాచ్ కావడం.. సొంత మైదానం లో ఆడుతుండడంతో చెన్నై జట్టు అద్భుతమైన ప్రదర్శన ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా ధోని కొద్ది నెలలుగా కేవలం ఐపిఎల్ కోసమే ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ప్రకారం చూస్తే అతడు ఆదివారం సొంత మైదానంలో తన బ్యాటింగ్ విన్యాసాలను ప్రదర్శించే అవకాశం ఉంది.
Also Read: ఆరేంజ్ ఆర్మీ రె‘ఢీ’ ఈరోజు ఎంత కొడుతుందో ఏమో?
ముంబై జట్టు ఎలా ఉందంటే
గత సీజన్లో స్లో ఓవర్ రేటు కారణంగా ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై ఒక మ్యాచ్ వేటు పడింది. దీంతో తొలి మ్యాచ్ కు సూర్య కుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. ముంబై జట్టులో సూర్య కుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జాకబ్స్, తిలక్ వర్మ,
కార్బిన్ బాష్ వంటి వారు బ్యాటింగ్ భారం మోయనున్నారు. రోహిత్, తిలక్ వర్మ తిరుగులేని ఫామ్ లో ఉన్నారు. బుమ్రా ఆడేది అనుమానంగా ఉన్న నేపథ్యంలో.. బౌల్ట్, టోప్లే, దీపక్ చాహర్, అశ్వని కుమార్ పేస్ బౌలింగ్ భారాన్ని మోస్తారు. ఒకవేళ సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు అవకాశం లభిస్తే.. అతడు కూడా పేస్ బౌలర్ గా మైదానంలో కనిపించే అవకాశం ఉంది.. బ్యాటింగ్ పరంగా ముంబై జట్టుకు ఇబ్బంది లేకపోయినప్పటికీ.. బౌలింగ్ విషయానికి వచ్చేసరికి ఆ జట్టు కాస్త తడబడుతోంది.. చెన్నై లోని చిదంబరం మైదానాన్ని ప్లాట్ పిచ్ గా రూపొందించిన నేపథ్యంలో.. ముంబై బౌలర్లు చెన్నై జట్టును కట్టడి చేసిన దానిపైనే సూర్య కుమార్ సేన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
కొదమసింహాలే
ఐపీఎల్ లో అత్యంత బలమైన జట్లుగా చెన్నై, ముంబై కొనసాగుతున్నాయి.. ఇప్పటివరకు ఐపీఎల్లో చెన్నై, ముంబై 37 సార్లు పరస్పరం తలపడ్డాయి. ఇందులో ముంబై జట్టు 20, చెన్నై జట్టు 17 సార్లు విజయం సాధించాయి.. 2024, 2023 సీజన్లలో మూడుసార్లు ఈ రెండు జట్లు పరస్పరం తలపడ్డాయి. మూడు మ్యాచ్లలోనూ చెన్నై జట్టు ముంబై పై విజయం సాధించడం విశేషం. మరి ఈసారి ముంబై జట్టు రివెంజ్ తీర్చుకుంటుందా.. చెన్నై జట్టు ఆనవాయితీ కొనసాగిస్తుందా.. అనే ప్రశ్నలకు సమాధానం లభించాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే.