India Cricketer: భారత క్రికెటర్, కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. గుర్తు తెలియన ద్రవం తాగడంతో మయాంక్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడపునొప్పి, వాంతులు, గొంతునొప్పితో బాధపడ్డారు. దీంతో అతడిని జట్టు సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఏం జరిగిందంటే..
మయాంక్ అగర్వాల్ 2023–24 రంజీ ట్రోఫీలో కర్ణాటక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు జట్టు తరఫున రెండ సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేశాడు. మంగళవారం కర్ణాక నుంచి త్రిపుర రాజధాని అగర్తలకు ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తాగునీరు అనుకుని ఓ సీసాలో ఉన్న గుర్తుతెలియని ద్రవం తాగాడు. దీంతో కడుపు నొప్పి, గొంతునొప్పి, వాంతులు కావడంతో టీం సభ్యులు అగర్తలలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
నిలకడగా ఆరోగ్యం..
అగర్వాల్‌లో చేరిన ఆస్పత్రి వైద్యులు అతని హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ప్రస్తుతం అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. కొంత నోటి చికాకు, పెదవుల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. మరో 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండనున్నట్లు తెలిపారు. మరికొన్ని పరీక్షల తర్వాత రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, త్రిపుర క్రికెట్ అసోసియేషన్ అధికారులు మయాంక్‌ను ఆస్పత్రిలో పరామర్శించారు.
పోలీసులకు ఫిర్యాదు..
ఇదిలా ఉండగా అగర్వాల్‌కు జరిగిన ఘటనపై కర్ణాటక క్రికెట్ టీమ్ మేనేజర్ త్రిపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏం జరిగిందో విచారణ చేయాలని త్రిపుర వెస్ట్ ఎస్‌పీ కిరణ్‌కుమార్‌ను కోరింది. ఈమేరకు అగర్తలలోని న్యూ క్యాపిటల్ కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అగర్వాల్ అనారోగ్యం కారణంగా మిగతా మ్యాచ్‌లు ఆడబోడని కర్ణాటక టీం మెనేజ్‌మెంట్ తెలిపింది.