https://oktelugu.com/

మ్యాక్స్ వెల్, కోహ్లీ సత్తా: హైదరాబాద్ టార్గెట్ 150

ఐపీఎల్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో బౌలర్లు సత్తా చాటారు. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చిన హైదరాబాద్ బౌలర్లు రెండో మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ సేనను కట్టిపడేశారు. పరుగులు చేయడానికి శ్రమించేలా చేశారు. హైదరాబాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోహ్లీ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ ఒక్కడే 59 పరుగులతో ఒంటరి […]

Written By:
  • NARESH
  • , Updated On : April 14, 2021 9:39 pm
    Follow us on

    ఐపీఎల్ ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో బౌలర్లు సత్తా చాటారు. తొలి మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చిన హైదరాబాద్ బౌలర్లు రెండో మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ సేనను కట్టిపడేశారు. పరుగులు చేయడానికి శ్రమించేలా చేశారు.

    హైదరాబాద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో కోహ్లీ సేన 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్ ఒక్కడే 59 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు.

    టాస్ గెలిచిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన పడికల్ త్వరగా ఔట్ కాగా కోహ్లీ, మ్యాక్స్ వెల్ మాత్రమే నిలబడి పరుగులు చేశాడు. కోహ్లీ 33 ఔట్ అయ్యాక డివిలియర్స్ కూడా త్వరగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్ వెల్ ఆఖర్లో సిక్సులు, ఫోర్లు కొట్టడంతో బెంగళూరు 149 పరుగులకు చేరుకుంది. హోల్డర్ 3, రషీద్ 2 వికెట్లు తీసుకున్నారు.

    ఇక బ్యాటింగ్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు వార్నర్, సాహా నెమ్మదిగా ఆడుతున్నారు. ఇక సాహాను సిరాజ్ స్లిప్ లో క్యాచ్ ద్వారా ఔట్ చేశాడు. హైదరాబాద్ 2.2 ఓవర్ల సమయంలో సాహా 1 పరుగుకే ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 2.2 ఓవర్లలో హైదరాబాద్ 13/1 పరుగులతో ఆడుతోంది.