నెలకు పదివేలు కడితే కొత్త కారు మీ సొంతం.. ఎలా అంటే..?

మన దేశంలో ఇతర కార్లతో పోలిస్తే ఎక్కువగా అమ్ముడయ్యే కారుగా మారుతి స్విఫ్ట్ కు పేరుంది. పదిహేను సంవత్సరాల క్రితం మారుతి స్విఫ్ట్ మోడల్ ను లాంఛ్ చేయగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మోడల్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ కారు ఎక్కువగా సేల్ అవుతున్న కారుగా నిలవడం గమనార్హం. మారుతి స్విఫ్ట్ కారులో ఎప్పటికప్పుడు స్వల్పంగా మార్పులు చేస్తూ కస్టమర్లకూ మారుతి కంపెనీ మరింత చేరువవుతోంది. ఈ ఏడాది మార్కెట్ లోకి వచ్చిన […]

Written By: Navya, Updated On : April 15, 2021 4:06 pm
Follow us on

మన దేశంలో ఇతర కార్లతో పోలిస్తే ఎక్కువగా అమ్ముడయ్యే కారుగా మారుతి స్విఫ్ట్ కు పేరుంది. పదిహేను సంవత్సరాల క్రితం మారుతి స్విఫ్ట్ మోడల్ ను లాంఛ్ చేయగా అప్పటినుంచి ఇప్పటివరకు ఈ మోడల్ కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ ఈ కారు ఎక్కువగా సేల్ అవుతున్న కారుగా నిలవడం గమనార్హం. మారుతి స్విఫ్ట్ కారులో ఎప్పటికప్పుడు స్వల్పంగా మార్పులు చేస్తూ కస్టమర్లకూ మారుతి కంపెనీ మరింత చేరువవుతోంది.

ఈ ఏడాది మార్కెట్ లోకి వచ్చిన మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తోంది. నెలకు కేవలం పదివేల రూపాయలు చెల్లించడం ద్వారా ఈ కారును సొంతం చేసుకోవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర 5.73 లక్షల రూపాయలుగా ఉంది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ ధర 8.41 లక్షల రూపాయలుగా ఉంది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వాళ్లు ఫైనాన్స్ రూపంలో కొనుగోలు చేయవచ్చు.

ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటే కనీసం 1,28,759 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకులు 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నాయి. లోన్ తీసుకున్న వాళ్లు ప్రారంభ ధర అయిన 5.73 లక్షల రూపాయల కారును నెలకు 10,000 రూపాయలు చెల్లించడం ద్వారా కొనుగోలు చేయవచ్చు.

టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ కారును కొనుగోలు చేయాలంటే 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. సమీపంలోని మారుతి షోరూంను సంప్రదించి ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.