Pakistan Team : భారత్‌ చేతిలో ఓడిపోయాక పాక్‌ జట్టు ఏం చేసిందో తెలుసా? 

Pakistan Team నాయకుడు అంటే నడిపించేవాడు.. పోటీలో గెలుపుకు పొంగి పోకుండా.. ఓటమికి కుంగి పోకుండా.. జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని, తప్పులను సరిదిద్దుకుని, సహచరుల్లో స్ఫూర్తి నింపి తర్వాతి పోటీకి జట్టును సిద్ధం చేయాల్సింది కెప్టెనే. ఇండియాపై పోరాడి ఓడి తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్తాన్‌ జట్టు సభ్యులకు కెప్టెన్‌ బాబర్‌ నిజమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. క్రీడాకారులను బాబర్‌ మోటివేట్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ […]

Written By: NARESH, Updated On : October 24, 2022 3:07 pm
Follow us on

Pakistan Team నాయకుడు అంటే నడిపించేవాడు.. పోటీలో గెలుపుకు పొంగి పోకుండా.. ఓటమికి కుంగి పోకుండా.. జట్టును ముందుకు నడిపించాల్సిన బాధ్యత కెప్టెన్‌దే. ఓటమి నుంచి పాఠం నేర్చుకుని, తప్పులను సరిదిద్దుకుని, సహచరుల్లో స్ఫూర్తి నింపి తర్వాతి పోటీకి జట్టును సిద్ధం చేయాల్సింది కెప్టెనే. ఇండియాపై పోరాడి ఓడి తీవ్ర నిరాశలో ఉన్న పాకిస్తాన్‌ జట్టు సభ్యులకు కెప్టెన్‌ బాబర్‌ నిజమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. క్రీడాకారులను బాబర్‌ మోటివేట్‌ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కెప్టెన్‌ సహచరుల్లో స్ఫూర్తి నింపిన తీరుపై నెటిజన్లు.. ప్రశంసలు కురిపిస్తున్నారు.
దాయాదుల పోరంటేనే ఉత్కంఠ.. 
దాయాది దేశాలు అయిన ఇండియా – పాకిస్తాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మనం ఎంత ప్రశాంగా ఉన్నా.. గిచ్చి కయ్యం పెట్టుకుంటుంది పాకిస్తాన్‌. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. అయితే రెండు దేశాల జట్లు క్రికెట్‌లో రాణిస్తుండడంతో ప్రపంచ వేదికలపై తలపడక తప్పని పరిస్థితి. రెండు జట్ల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఇరు దేశాల క్రికెట్‌ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. చివరి బంతి వరకు ఇరు జట్ల క్రీడాకారులు కూడా పోరాడుతారు. తాజాగా జరుగుతున్న టీ–20 వర ల్డ్‌ కప్‌లో ఆదివారం ఇండియా పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యక్షంగా మ్యాచ్‌ చూస్తున్నవారే కాకుండా టీవీల ముందు చూస్తున్నవారు కూడా టెన్షన్‌ పడ్డారు. రెండు జట్ల క్రీడాకారులు విజయం కోసం చివరి బంతి వరకూ పోరాడారు. కానీ పోటీలో విజయం ఒకరినే వరిస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు భారత్‌వైపు నిలిచింది. దీంతో పాక్‌ క్రికెటర్లకు నిరాశే మిగిలింది.
నైరాశ్యంలో పాక్‌ క్రికెటర్లు.. 
టీ–20 వరల్డ్‌ కప్‌లో భారతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌కు ఓటమి తప్పలేదు. గెలుపు కోసం పాక్‌ క్రీడాకారులు చివరి వరకూ పోరాడు. కానీ విజయం మాత్రం భారత్‌వైపే నిలిచింది. దీంతో పాకిస్తాన్‌ క్రీడాకారులు కుంగిపోయారు. దీంతో మ్యాచ్‌ ముగిసిన తర్వాత మైదానాన్ని కూడా నిరాశగానే వీడారు. వీరిలోని బాధను గుర్తించిన కెప్టెన్‌ బాబర్‌ డ్రెస్సింగ్‌ రూంలో క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపిన తీరును అందరూ అభినందిస్తున్నారు. క్రీడాకారులంతా ఓటమి బాధలో ఉన్నా… కెప్టెన్‌ బాబర్‌ కూడా బాధలో ఉన్నా.. తన బాధను దిగమింగుకుని జట్టు సభ్యులను తర్వాత మ్యాచ్‌కు సన్నద్ధం చేసే బాధ్యతను తీసుకున్నారు. ‘ఇండియా మ్యాచ్‌లో అందరం బాగా ఆడాం. అయితే ఫలితం నిరాశ పర్చినా ఓటమికి ఏ ఒక్కరూ బాధ్యులు కారు. బాధ పడాల్సిన పనిలేదు. మ్యాచ్‌లో కొన్ని తప్పులు చేశాం. వాటి నుంచి గుణపాఠం చేర్చుకుని తర్వాతి మ్యాచ్‌కు సిద్ధం అవుదాం. ఓడిపోయామని బాధపడితే తర్వాత మ్యాచ్‌లోనూ ఫలితం నిరాశ పరుస్తుంది. సమష్టిగా మిగతా మ్యచ్‌లలో పోరాడుదాం. అందుకు మానసికంగా సిద్ధం అవుదాం’ అంటూ ఆయన మాట్లాడిన తీరు సహచుల్లో ధైర్యం నింపింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.
https://www.youtube.com/watch?v=4oK0q_-vrxw