SRH: ఏయ్ ఎవడ్రా సన్ రైజర్స్ ను తిట్టింది?.. ఏకి పడేస్తున్న అభిమానులు..

వాస్తవానికి ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ అదిరిపోయే ఆట తీరును ప్రదర్శించింది. 250+ స్కోర్ ను కొట్టడం అత్యంత సులభమని చేతల్లో చూపించింది. పరుగుల వరదను పారించి.. తోపు బౌలర్లకు కూడా నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. చూస్తోంది హైలెట్సా, లైవా అనే అనుమానం వచ్చేలా ఫోర్లు, సిక్స్ ల మోత మోగించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 17, 2024 3:18 pm

SRH

Follow us on

SRH: ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్లే ఆఫ్ కు చేరుకుంది. గురువారం గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో.. హైదరాబాద్ జట్టుకు ఒక పాయింట్ లభించింది. అప్పటికే హైదరాబాద్ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. ఎంపైర్లు ఒక పాయింట్ కేటాయించడంతో.. 15 పాయింట్లతో దర్జాగా ప్లే ఆఫ్ వెళ్ళిపోయింది. ఇక ఆదివారం పంజాబ్ జట్టుతో తలపడే మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ టాప్ -2 లోకి వెళ్తుంది. ఆ సమయంలో కోల్ కతా చేతిలో రాజస్థాన్ ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే హైదరాబాద్ రెండవ స్థానంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ ప్లే ఆఫ్ కు వెళ్లడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ పోస్టులతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్లను ఏకిపడేస్తున్నారు.

వాస్తవానికి ఈ ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ అదిరిపోయే ఆట తీరును ప్రదర్శించింది. 250+ స్కోర్ ను కొట్టడం అత్యంత సులభమని చేతల్లో చూపించింది. పరుగుల వరదను పారించి.. తోపు బౌలర్లకు కూడా నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. చూస్తోంది హైలెట్సా, లైవా అనే అనుమానం వచ్చేలా ఫోర్లు, సిక్స్ ల మోత మోగించింది. అయితే హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరదని కొంతమంది మాజీ క్రికెటర్లు జోస్యం చెప్పారు. అసలు హైదరాబాద్ కు అంత సీన్ లేదని గేలి చేశారు. ఈ జాబితాలో హర్భజన్ సింగ్, హర్షా భోగ్లే వంటి వారు ఉన్నారు. “జియో సినిమా” యాప్ కూడా హైదరాబాద్ జట్టుతో పరోక్షంగా పరిహాసమాడింది. కోల్ కతా, రాజస్థాన్, చెన్నై, బెంగళూరు మాత్రమే ప్లే ఆఫ్ వెళ్తాయని అప్పట్లో పోస్టర్ కూడా విడుదల చేసింది.

నవ్వినా నాప చేనే పండుతుందనే సామెతను నిజం చేసి చూపించారు హైదరాబాద్ ఆటగాళ్లు. అనితర సాధ్యమైన ఆటతీరుతో సరికొత్త రికార్డులు సృష్టించారు. ముంబై, బెంగళూరు జట్టుపై రికార్డు స్థాయిలో పరుగులు చేసి సరికొత్త చరిత్రను నెలకొల్పారు.. ఈ క్రమంలో నాడు హైదరాబాద్ జట్టును గేలి చేసిన సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ను అభిమానులు విమర్శిస్తున్నారు.. సోషల్ మీడియా వేదికగా మీమ్స్ తో ట్రోల్ చేస్తున్నారు. “హైదరాబాద్ గెలవదన్నారు, నిలవదన్నారు.. ఇప్పుడు చూడండి” అంటూ అభిమానులు హర్భజన్ సింగ్, హర్షా భోగ్లే, జియో సినిమాను ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి.