https://oktelugu.com/

Prabhas: ప్రభాస్ జీవితంలోకి రాబోతున్న ఆ కొత్త పర్సన్ ఎవరో తెలుసా..?

ప్రస్తుతం ఆయన చేస్తున్న అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయనే చెప్పాలి. ఇక దాంతోపాటుగా ఆయన ఇప్పుడు రెస్ట్ లేకుండా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.

Written By: , Updated On : May 17, 2024 / 03:09 PM IST
who is the new person coming into Prabhas life

who is the new person coming into Prabhas life

Follow us on

Prabhas: సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది నటులు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ స్టార్ హీరోగా రాణించాలంటే కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమం లోనే ప్రభాస్ హీరోగా పేరు తెచ్చుకోవడమే కాకుండా పాన్ ఇండియా లో తనతో పోటీ పడే నటుడు మరొకరు లేరు అనేంతలా ఆయన తన సత్తా చాటుతూ వరుసగా సక్సెస్ లను సాధిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన చేస్తున్న అన్ని సినిమాలు కూడా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయనే చెప్పాలి.

ఇక దాంతోపాటుగా ఆయన ఇప్పుడు రెస్ట్ లేకుండా సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ప్రతి హీరో ఎలాగైతే సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడో ప్రభాస్ కూడా అదే మాదిరిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా తను ఇన్స్టాలో పెట్టిన ఒక స్టోరీ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఏంటంటే “డార్లింగ్స్ తొందరలోనే నా లైఫ్ లోకి ఒక కొత్త పర్సన్ రాబోతున్నారు” అంటూ ఆయన పెట్టిన స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఇక ఈ స్టోరీ చూసిన కొందరు ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడేమో కొత్త పర్శన్ అంటే తన భార్య కావచ్చు అంటూ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ప్రమోషన్ చేయబోతున్నాడు దానికి సంబంధించిన విషయం చెప్తాడేమో అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ప్రభాస్ కు సంబంధించిన న్యూస్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతుంది.ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ తీరిక లేకుండా సినిమాలకి కమిట్ అయి ఉన్నాడు.

కాబట్టి తనకి ఇప్పుడు పెళ్లి చేసుకునే సమయం లేదు. ఇక పెళ్లికి సంబంధించిన విషయాలు కాకుండా వేరే విషయాలను తను చెప్పబోతున్నట్టుగా కూడా మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక మొత్తానికైతే యంగ్ రెబల్ స్టార్ ఏం చెబుతాడా అనే దానికోసమే చాలామంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు…