CM Revanth Reddy: తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు.. రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం..?

నిబంధనల సాకుతో రేవంత్‌ సర్కార్‌ భూము ధరలకు రెక్కలు తీసుకురావాలి చూస్తోంది. ఇప్పటికే సామాన్యుడు ఇంటి స్థలం కొనుగోలు చేసే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది.

Written By: Raj Shekar, Updated On : May 17, 2024 3:25 pm

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు వివిధ సంక్షేమ పథకాల అమలుకు నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణలోని రేవంత్‌రెడ్డి సర్కార్‌ ఆదాయం పెంపుపై దృష్టిపెట్టింది. లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.

ఆదాయం పెంపు కోసం సమీక్ష..
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచేందు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం రేవంత్‌రెడ్డి సంబంధిత శాఖ అధికారులతో సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను నాటి కేసీఆర్‌ సర్కార్‌ పెంచింది. ఇప్పటికీ అవే అమలవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌ విలువకు, వాస్తవిక ధరకు మధ్య భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సీఎం అభిప్రాయపడ్డారు.

నిబంధనల సాకుతో వడ్డన..
నిబంధనల సాకుతో రేవంత్‌ సర్కార్‌ భూము ధరలకు రెక్కలు తీసుకురావాలి చూస్తోంది. ఇప్పటికే సామాన్యుడు ఇంటి స్థలం కొనుగోలు చేసే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయింది. పెంచిన భూములు, రిజిస్ట్రేషన్‌ ధరలతో చాలా మంది భూముల కొనుగోలుకు వెనుకాడుతున్నారు. సొంత ఇంటి కల, కలగానే మిగిలిపోతోంది. ఈ క్రమంలో రేవంత్‌ సర్కార్‌ నిబంధనల సాకుతో భూముల ధరలు పెంచాలని చూస్తున్నారు. ఏడాదికి ఒకసారి భూముల ధరలు సవరించాలన్న నిబంధనను అమలు చేయాలని నిర్ణయించారు. ధరల సవరణకు చర్యలు చేపట్టాలని ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంపుతోపాటు స్థిరాస్థి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేలా భూముల ధరలు మార్కెట్‌ ధరలకు అనుగుణంగా సవరించాలని తెలిపారు.

స్టాంప్‌డ్యూటీ కూడా..
ఇక భూముల ధరలతోపాటు స్టాంప్‌ డ్యూటీ కూడా పెంచడమో, తగ్గించడమో చేయాలి రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానంపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

ప్రాంతాల గుర్తింపునకు ఆదేశాలు..
రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి వినియోగించే స్థలాల ధరలను సవరించాలని సీఎం ఆదేశించారు. ఈమేరకు ఏయే ప్రాంతాల్లో ఎంత పెంచాలో గుర్తించాలని కూడా సూచించారు. శాస్త్రీయంగా, రిజిస్ట్రేషన్‌ స్టాంపు లశాఖ నిబంధనల ప్రకారం.. ధరల సవరణ ఉండాలని తెలిపారు.