Young Cricketer Died : మహారాష్ట్రలోని పూణే నగరంలోని గార్వేర్ స్టేడియంలో 35 సంవత్సరాల ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. కొద్దిసేపు మెరుగ్గానే బ్యాటింగ్ చేశాడు. పరుగులు కూడా పర్వాలేదనే స్థాయిలోనే సాధించాడు. ఇందులోనే చాతిలో నొప్పి అంటూ కింద పడిపోయాడు. కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించాడు. డగ్ అవుట్ లో ఉన్న అతడి సహచరులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతేకాదు అతడు తన హెల్మెట్ తీసుకురావాలని సహచర్లకు సూచించాడు.. చాతిలో మాత్రమే కాదు చేయి వద్ద కూడా విపరమైన నొప్పి రావడంతో అంపైర్లకు ఈ విషయాన్ని చెప్పాడు. ఎంతో అంపైర్లు అతనికి మైదానం నుంచి బయటికి వెళ్లిపోవడానికి అనుమతించారు. పెవిలియన్ వైపు వెళ్తున్న ఇమ్రాన్ కొంత దూరం సజావుగానే నడిచాడు. ఆ తర్వాత కింద పడిపోయాడు ఎంపైర్లు, తోటి ఆటగాళ్లు అతని వైపు పరుగులు తీశారు. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఇమ్రాన్ చనిపోయాడని నిర్ధారించారు..” ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉంటాడు. ఎటువంటి అలవాట్లు లేవు. అతడు అనారోగ్యానికి గురైన దాఖలాలు ఎప్పుడూ లేవు. కానీ ఇలా గుండెపోటుతో చనిపోవడం దారుణం. 35 సంవత్సరాల ఇమ్రాన్ పటేల్ ఆల్ రౌండర్.. అలాంటి ఆటగాడు చనిపోవడం అత్యంత విషాదమని” సహచర ఆటగాళ్లు చెబుతున్నారు.
ఇదీ నేపథ్యం
ఇమ్రాన్ పటేల్ కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇందులో చిన్న కుమార్త వయసు 4 నెలలు మాత్రమే. ఇమ్రాన్ పటేల్ రియల్ ఎస్టేట్ వ్యాపారిగా కొనసాగిస్తున్నాడు. ఇక ఇదేనగరంలో రెండు నెలల క్రితం హబీబ్ షేక్ అనే వ్యక్తి కూడా క్రికెట్ ఆడుతూనే దుర్మరణం పాలయ్యాడు. అతనికి కూడా గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తున్న సమయంలో హబీబ్ కు షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయాయి. అందువల్లే అతడు చనిపోయాడు..” ఇటీవల కాలంలో ఆటగాళ్లు క్రికెట్ ఆడుతూ చనిపోతున్న సంఘటనలు పెరిగిపోయాయి. కోవిడ్ తర్వాత అందరి ఆరోగ్యాలలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎటువంటి అలవాట్లు లేని వారు.. ప్రతిరోజు వ్యాయామం చేసేవారు.. మద్యం, మాంసం ముట్టని వారు కూడా చనిపోతున్నారు. ఇలాంటి పరిణామాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒక వయసు దాటిన తర్వాత వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని” వైద్యులు పేర్కొంటున్నారు. కాగా, ఇమ్రాన్ పటేల్ ఆడుతున్నప్పుడు ఒకసారి గా రక్తపోటు పెరిగిందని.. అందువల్లే గుండెపై ఒత్తిడి పెరిగి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెప్తున్నారు.. గోల్డెన్ అవర్ దాటిపోవడం వల్ల ఏమీ చేయలేకపోయామని.. చాతిలో నొప్పి వచ్చినప్పుడు అతని ముందుగానే ఆసుపత్రికి వచ్చి ఉంటే బాగుండేదని వివరిస్తున్నారు.. అతడు నొప్పితో విలవిలాడుతున్నప్పుడు సిపిఆర్ చేసి ఉంటే బతికేవాడని వైద్యులు పేర్కొంటున్నారు.