Lucknow Vs Delhi: ఇల్లు అలకగానే పండగ కాదు. అలాగే సిక్సర్ కొట్టగానే ఆ బ్యాటర్ తోపు కాదు. కానీ.. బుధవారం ఢిల్లీ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో లక్నో ఆటగాడు అలాగే అనుకున్నాడు. సిక్సర్ కొట్టాను.. ఇక తిరుగులేదు అనుకున్నాడు. కానీ.. దూసుకు వచ్చిన బంతి అతని పొగరును.. నేలకు దించింది. అంతేకాదు ఇంకోసారి ఇలా బిల్డప్ ఇస్తే అంతే సంగతులు అని స్పష్టంగా చెప్పింది.
బుధవారం లక్నో వేదికగా లక్నో, ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. లక్నో జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఏ ముహూర్తంలో అయితే రిషబ్ పంత్ దురదృష్టవశాత్తు రన్ అవుట్ అయ్యాడో.. అప్పటినుంచి లక్నో జట్టు తీవ్రమైన ఇబ్బంది పడింది. ఢిల్లీ బౌలర్లు ముప్పేట దాడి చేశారు. ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చుక్కలు చూపించారు. లక్నో జట్టు టాప్ ఆర్డర్ మొత్తం బలంగా ఉన్నప్పటికీ.. మార్ష్(35), సమద్ (33*) మినహా మిగతా వారంతా ఢిల్లీ బౌలర్లకు దాసోహం అయ్యారు.
లక్నో జట్టు ఇన్నింగ్స్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. పంత్ అవుతున్న తర్వాత వన్ డౌన్ ఆటగాడిగా మార్క్రం వచ్చాడు. 8 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టి 11 పరుగులు చేశాడు. దూకుడుగా కనిపిస్తున్న అతడిని అక్షర్ పెవిలియన్ పంపించాడు. అక్షర్ బౌలింగ్లో బౌండరీ కొట్టి.. ఆ తర్వాత సిక్సర్ కొట్టి దూకుడు మీద కనిపించిన మార్క్రం .. ఆ తదుపరి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. అక్షర్ లో లెవెల్ లో బంతిని వేశాడు. ఆ బంతి మిస్ అయ్యి వికెట్లను పడగొట్టింది. దీంతో మార్క్రం ఔట్ అయ్యాడు.
అతడు అవుట్ కావడంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. లక్నో ప్లేయర్లతో పాటు.. అభిమానులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.. ఇదంతా కలనా? నిజమా అని చర్చించుకున్నారు. అతడు అవుట్ కావడంతో.. లక్నో జట్టు స్కోర్ మీద తీవ్రమైన ప్రభావం పడింది.. అక్షర్ ఇప్పుడు మాత్రమే కాదు.. 2024 t20 వరల్డ్ కప్ లో కూడా ఇదే స్థాయిలో బౌలింగ్ చేశాడు. అందువల్లే టీమిండియా విజేతగా నిలిచింది.
