LSG Vs RR IPL 2025: శనివారం నాటి లక్నో – రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో.. మొదటినుంచి కూడా రాజస్థాన్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. చేస్తాను బ్యాటర్లలో ఓపెనర్లు అలాగే ఆడారు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తుఫాన్ స్థాయిలో ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లను ఒక రకంగా చీల్చి చెండాడారు. అయితే అటువంటి ఆటగాళ్లు ఒక్కసారి గా లైన్ తప్పారు. లక్నో బౌలర్ల ముందు తల వంచారు. 181 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన రాజస్థాన్ ఆటగాళ్లు 17 ఓవర్లు పూర్తయ్యే సరికి 156/2 వద్ద నిలిచారు. ఈ దశలో లక్నో ఓటమిపై.. రాజస్థాన్ గెలుపుపై ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. కానీ ఇక్కడే లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆవేష్ ఖాన్ ను రంగంలోకి దింపాడు. అంతే ఒక్కసారి గా మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. 18 ఓవర్లు ఆవేష్ ఖాన్ యశస్వి జైస్వాల్ ను వెనక్కి పంపించాడు. రియాన్ పరాగ్ ను అవుట్ చేశాడు. ఆ ఓవర్లో కేవలం ఐదు మాత్రమే పరుగులు ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 9 పరుగులు కావాలి. కానీ ఈ దశలో హిట్ మేయర్ నిర్లక్ష్యం వల్ల రాజస్థాన్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది. చివరికి హిట్ మేయర్ వికెట్ కూడా పడగొట్టి ఆవేష్ ఖాన్ అద్భుతం చేశాడు. లక్నో జట్టుకు ఊహించని గెలుపు అందించాడు.
Also Read: 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో
ఫలితం అనుభవించింది
రాజస్థాన్ జట్టులో విభేదాలు ఉన్నాయని ఇటీవల కాలంలో విమర్శలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టుగానే ఆ జట్టు ఆట తీరు కూడా ఉంటున్నది. తాజాగా లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ రాజస్థాన్ ఆటగాళ్ళ మధ్య పెద్దగా సయోధ్య ఉన్నట్టు కనిపించలేదు. ఓపెనర్లు దూకుడుగా ఆడితే.. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. ముఖ్యంగా దూకుడుగా పరుగులు చేస్తాడు.. అద్భుతంగా ఆడతాడని పేరు ఉన్న హిట్ మేయర్ దారుణంగా విఫలమయ్యాడు. చివరి ఓవర్ లో ఏ మాత్రం దూకుడు ప్రదర్శించకపోగా.. టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేశాడు. ఆవేష్ ఖాన్ వేసిన బంతులను ఎదుర్కోలేకపోయాడు. చివరికి అవుట్ కూడా అయ్యాడు. దీంతో రాజస్థాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గెలుపు ముందు బోల్తా పడింది. సూపర్ ఓవర్లో చేతులెత్తేసింది. ఇక ఇప్పుడు కూడా లక్నో జట్టుపై అదే ఆట తీరు ప్రదర్శించింది. తద్వారా గెలుపు ముందు బోల్తా పడి.. లేని ఓటమిని కొని తెచ్చుకుంది. అంతేకాదు ప్లే ఆఫ్ ఆశలను పూర్తిగా సంక్లిష్టం చేసుకుంది. ఈ ఓటమి ద్వారా రాజస్థాన్ జట్టు దాదాపు ప్లే ఆఫ్ ఆశలను వదిలేసుకున్నట్టే. ఒకవేళ రాజస్థాన్ జట్టు గనక ప్లే ఆఫ్ వెళ్ళాలి అంటే.. ఇకపై ఆడే ప్రతి మ్యాచ్ గెలవాలి. అంతేకాదు తన ప్రత్యర్థి జట్లు భారీ తేడాతో ఓటమి పాలు కావాలి. అప్పుడే రాజస్థాన్ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అన్నట్టు గత సీజన్లో రాజస్థాన్ జట్టు ప్లే ఆఫ్ వెళ్ళింది.
Also Read: అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు లక్నో.. రాజస్థాన్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందేమో?