LSG Vs RR IPL 2025: ఐపీఎల్ గత సీజన్లో రాజస్థాన్ జట్టు అద్భుతంగా ఆడింది. ఏకంగా ప్లే ఆఫ్ దాకా వెళ్ళింది. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆ స్థాయిలో ఆడ లేకపోతోంది. జట్టులో విభేదాలు.. ఇతర సమస్యలు గెలుపు ముందు బోల్తాపడేలా చేస్తున్నాయి. దీంతో రాజస్థాన్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతోంది. వాస్తవానికి చెన్నై, హైదరాబాద్ కనక కాస్త మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి ఉంటే.. రాజస్థాన్ దిగువ స్థానంలో ఉండేదే. ఆ రెండు జట్లకు సరైన నెట్ రన్ రేట్ లేకపోవడం వల్ల ఎనిమిదవ స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇటీవల ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ గెలుపు అంచుల వరకు వచ్చింది. కానీ అనూహ్యంగా ఆ మ్యాచ్ లో రాజస్థాన్ ఆటగాళ్లు చివరి ఓవర్లో తడబాటుకు గురయ్యారు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు దారి తీసింది. సూపర్ ఓవర్ లో రాజస్థాన్ బ్యాటర్లు తేలిపోయారు. ఢిల్లీ ఆటగాళ్లు ఆ లక్ష్యాన్ని కేవలం 4 బంతుల్లోనే చేదించారు. మొత్తంగా గెలుపు ముందు రాజస్థాన్ జట్టు బోల్తా పడింది. ఒక రకంగా జట్టులో ఉన్న అనైక్యత వాతావరణం వల్ల ఢిల్లీ జట్టు మందు తలవంపులకు గురికావాల్సి వచ్చింది..
Also Read: చెన్నైలో ముంబైని కొట్టారు.. ఇప్పుడు ముంబైలో చెన్నైని కొడుతారా?
లక్నో చేతిలో..
లక్నో చేతిలో శనివారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిపాలైంది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ ఉత్కంఠ గా సాగింది. రెండు పరుగుల తేడాతో లక్నో విజయం సాధించింది. చివరి ఓవర్లో రాజస్థాన్ జట్టు విజయానికి 9 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ దశలో లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. హిట్ మేయర్ (12) ను అవుట్ చేసి రాజస్థాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు రాజస్థాన్ 8 మ్యాచ్ లు ఆడగా.. ఇది ఆరవ ఓటమి. దీంతో పాయింట్లు పట్టికలో రాజస్థాన్ ఐత్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇక లక్నో జట్టుకు ఇది ఐదో విజయం. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానంలో ఉంది. ఎనిమిది మ్యాచ్లు ఆడిన లక్నో ఐదు విజయాలు సాధించింది. +0.088 నెట్ రన్ రేట్ తో లక్నో జట్టు నాలుగో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు ఫిఫ్త్ స్థానంలో కొనసాగుతోంది. లక్నో జట్టు విధించిన 181 టార్గెట్ ను చేజ్ చేయడానికి రాజస్థాన్ రంగంలోకి దిగి.. 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 5 వికెట్లు లాస్ అయి.. 178 రన్స్ వరకే ఆగిపోయింది. రాజస్థాన్ జట్టుకు ప్రారంభంలో గొప్ప ఆరంభం లభించింది. మిగతా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. రియాన్ పరాగ్ 39 దూకుడుగా ఆడినప్పటికీ.. హిట్ మేయర్ 12 దారుణంగా విఫలమయ్యాడు. లక్నో బౌలర్లు ఆవేశ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్, మార్క్రం తలా ఒక వికెట్ సాధించారు.
Also Read: 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో