LSG Vs DC IPL 2025: రిషబ్ పంత్ ఇప్పటివరకు 106 పరుగులు మాత్రమే చేశాడు. ఈ లెక్కన చూసుకుంటే ఒక కోటి రూపాయలకు 4 రన్స్ కూడా చేయలని దుస్థితిలో అతడున్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఏడో స్థానంలో వచ్చినప్పటికీ.. అతడు ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. రెండు బంతులు ఎదుర్కొని.. ముఖేష్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ ముఖంలో ఆగ్రహం కనిపించింది. అన్నింటికీ మించి అతడిలో అసహనం ప్రస్ఫుటంగా దర్శనమిచ్చింది. రిషబ్ పంత్ అలా వెళ్ళిపోవడం అతని అభిమానులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేసింది. లక్నో జట్టులో రిషబ్ పంత్ సెకండ్ డౌన్ లో వస్తాడు. ముఖ్యంగా అతడు జహీర్ ఖాన్ వల్లే సరిగ్గా ఆడలేకపోతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో ప్రమాదకరమైన నికోలస్ పూరన్ పెవిలియన్ చేరుకోగానే రిషబ్ పంత్ మైదానంలోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అబ్దుల్ సమద్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ తర్వాత ఆయుష్ బదోని ఇంఫాక్ట్ ప్లేయర్ గా క్రీజ్ లోకి వచ్చాడు. ఇక చివర్లో రిషబ్ పంత్ వచ్చి.. రెండు బంతులు ఎదుర్కొని.. 0 పరుగులకే అవుట్ అయ్యాడు..” సొంత మైదానంలో పరిస్థితి మాకు అనుకూలంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం. అందువల్లే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పిచ్ పై అబ్దుల్ సమద్ ఎక్కువ పరుగులు చేస్తాడని భావించాం. ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ ను పంపించాం. అతని ద్వారా కూడా గొప్ప ఫలితాలు రాలేదు. మయాంక్ యాదవ్ జట్టులో లేని కారణంగా ఇంపాక్ట్ ఆటగాడిగా ఆయుష్ బదోని ని ఆడించాం. అయినప్పటికీ మేము కోరుకునే లక్ష్యం నెరవేరలేదని” ఓటమి తర్వాత రిషబ్ పంత్ వ్యాఖ్యానించాడు.
Also Read: బౌలింగ్, బ్యాటింగ్ రెండిట్లో టాప్ – 3 లో ఇద్దరు గుజరాత్ వాళ్ళే…
అతని వల్లే..
వాస్తవానికి ఆ లక్నో జట్టు ఇన్నింగ్స్ సమయంలో డగ్ అవుట్ లో రిషబ్ పంత్ చేతికి బ్యాండేజ్ కట్టుకొని కనిపించాడు. దీంతో అతని చేతికి గాయమైందని.. అందువల్లే ఏడవ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడని అందరూ అనుకున్నారు. అయితే అతడు జహీర్ ఖాన్, లాంగర్ నిర్ణయం మేరకు ఏడవ స్థానంలో వచ్చాడని ప్రచారం జరుగుతున్నది. తను రెండు బంతుల్లో అవుట్ కావడంతో నిరాశతో పెవిలియన్ వచ్చాడు. ఈ క్రమంలోనే జహీర్ ఖాన్ తో గొడవపడ్డాడని ప్రచారం జరుగుతున్నది. మైదానంలో అందరి ముందు ఆగ్రహం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అయితే దీనిపై అటు జహీర్ ఖాన్.. ఇటు రిషబ్ పంత్ ఇంతవరకు నోరు మెదపలేదు. మరోవైపు లక్నో జట్టు యాజమాన్యం కూడా స్పందించలేదు. ఓటమి తర్వాత రిషబ్ పంత్ ముభావంగా ఉన్నాడు. లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక లోపల ఆగ్రహంగా ఉన్నప్పటికీ.. పైకి నవ్వుతూ కనిపించాడు. మొత్తంగా చూస్తే రిషబ్ పంత్ మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే ఇలా ఆడుతున్నాడని అతడి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
embarassing from pant https://t.co/pSTn3lkScf pic.twitter.com/snbPkwAIwl
— sᴜɢᴀʀ (@Sugar_Sai_Gill) April 22, 2025
Also Read: అభిషేక్ శర్మ అలాంటివాడే.. సంచలన విషయాలు చెప్పిన యువరాజ్