IPL 2025: ఎటువంటి అంచనాలు లేని జట్లలోని ఆటగాళ్లు మాత్రం అదరగొడుతున్నారు. అంతేకాదు ఐపీఎల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ఈ జాబితాలో గుజరాత్ ఆటగాళ్లు ముందు వరుసలో ఉన్నారు. గుజరాత్ జట్టుకు చెందిన ప్రసిధ్ కృష్ణ, సాయి కిషోర్ బౌలింగ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు.. సాయి సుదర్శన్, జోస్ బట్లర్ బ్యాటింగ్ విభాగంలో అదరగొడుతున్నారు. తద్వారా ప్రస్తుత ఐపీఎల్ లో గుజరాత్ జట్టు ఆటగాళ్లు అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్ విభాగాలలో టాప్ -3 స్థానాలలో కొనసాగుతున్నారు.. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో గుజరాత్ జట్టు బౌలర్ ప్రసిధ్ కృష్ణ ఎనిమిది ఇన్నింగ్స్ లలో 16 వికెట్లు పడగొట్టి.. పర్పుల్ క్యాప్ విభాగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇతడి యావరేజ్ 14.12 గా ఉంది.. తర్వాత స్థానంలోనూ గుజరాత్ బౌలర్ సాయి కిషోర్ కొనసాగుతున్నాడు. ఇతడు ఎనిమిది మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టి సత్తా చూపుతున్నాడు. ఇతడి యావరేజ్ 16.33. ఇక మూడో స్థానంలో చెన్నై జట్టు బౌలర్ నూర్ అహ్మద్ కొనసాగుతున్నాడు. ఇతడు ఎనిమిది మ్యాచ్లలో 12 వికెట్లు పడగొట్టాడు. ఇతడి యావరేజ్ 17.25 గా ఉంది.
Also Read: అభిషేక్ శర్మ అలాంటివాడే.. సంచలన విషయాలు చెప్పిన యువరాజ్
బ్యాటింగ్ విభాగంలో..
బ్యాటింగ్ విభాగంలోనూ గుజరాత్ ప్లేయర్ల హవా కోన సాగుతోంది. గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్ లలో 417 పరుగులు చేశాడు . ఇటీవల కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా.. లక్నో ఆటగాడు పూరన్ ను సాయి సుదర్శన్ అధిగమించాడు. సాయి సుదర్శన్ యావరేజ్ 52.12. సాయి సుదర్శన్ తర్వాత నికోలస్ పూరన్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇతడు తొమ్మిది ఇన్నింగ్స్ లలో 377 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 47.12. పూరన్ తర్వాత స్థానంలో జోస్ బట్లర్ ఉన్నాడు. ఇతడు కూడా గుజరాత్ ఆటగాడు కావడం విశేషం. 8 ఇన్నింగ్స్ లలో బట్లర్ 356 పరుగులు చేశాడు. ఇతడి యావరేజ్ 71.20.
గొప్ప గొప్ప ఆటగాళ్లు లేకపోయినప్పటికీ
మిగతా జట్లతో పోల్చి చూస్తే గుజరాత్లో గొప్ప గొప్ప ఆటగాళ్లు లేకపోయినప్పటికీ.. ఉన్నవారితోనే ఆ జట్టు వరుస విజయాలు సాధిస్తున్నది.. బ్యాటింగ్ భారాన్ని గిల్, సాయి సుదర్శన్, బట్లర్ మోస్తున్నారు. అందరూ సమన్వయంతో ఆడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు గుజరాత్ 8 మ్యాచ్ లు ఆడింది. ఇందులో ఆరు విజయాలు సాధించింది.. పంజాబ్, లక్నో తో జరిగిన మ్యాచ్లలో మాత్రమే గుజరాత్ ఓడిపోయింది. ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కోల్ కతా, రాజస్థాన్ జట్లతో జరిగిన మ్యాచ్లలో గుజరాత్ గెలిచింది. ఇక పాయింట్లు పట్టికలో గుజరాత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ ఖాతాలో ప్రస్తుతం 12 పాయింట్లు ఉన్నాయి..నెట్ రన్ కూడా +1.104 ఉండడం విశేషం.
Also Read: ముంబై పై ఓడినా.. చెన్నైకి ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంది..