LSG KL Rahul : ఓనర్ తిట్టిన ఎఫెక్ట్ : లక్నో నుంచి కేఎల్ రాహుల్ ఔట్?

ఓడిపోయినంత మాత్రానా, రాహుల్ ను తక్కువ చేసి చూడొద్దని.. మిగతా రెండు మ్యాచ్లలో లక్నో ను గెలిపించి ప్లే ఆఫ్ తీసుకెళ్తాడని ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : May 9, 2024 10:05 pm

LSG KL Rahul

Follow us on

LSG KL Rahul : ఐపీఎల్ 17వ సీజన్ లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ చేతిలో లక్నో పది వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లే ఆఫ్ ఆశలను దాదాపుగా వదిలేసుకుంది.!? ఈ నేపథ్యంలో హైదరాబాద్ జట్టు చేతిలో ఎదురైన దారుణమైన ఓటమిని చూడలేక లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయేంకా కెప్టెన్ కే ఎల్ రాహుల్ పై మండిపడ్డాడు. ఇదేం ఆట తీరంటూ విరుచుకుపడ్డాడు.. సంజీవ్ వ్యవహరించిన తీరుతో రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో లక్నో జట్టు ఆడే మిగతా రెండు మ్యాచ్లకు రాహుల్ దూరంగా ఉంటాడని ప్రచారం జరుగుతోంది.

“మే 14న లక్నో జట్టు తన తదుపరి మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ ఆడేందుకు చాలా రోజులు గడువు ఉంది. ఈ నేపథ్యంలో తన పూర్వపు ఫామ్ అందుకునేందుకు రాహుల్ కెప్టెన్సీ ని పక్కన పెడతాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు చివరి రెండు మ్యాచ్లలో లక్నో కచ్చితంగా విజయం సాధించాలి. అప్పుడే ఆ జట్టుకు ఎంతో కొంత ప్లే ఆఫ్ ఆశలు మిగిలి ఉంటాయి. సంజీవ్ ఆ స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో రాహుల్ కు కెప్టెన్సీ అవకాశం ఉంటుందని నమ్మకం లేదని” సీనియర్ ఆటగాళ్లు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ వచ్చే రెండు మ్యాచ్ లు మాత్రమే కాకుండా, అసలు ఫ్రాంచైజీ కే దూరమవుతాడని తెలుస్తోంది. లక్నో జట్టు ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి కెప్టెన్ గా రాహుల్ కొనసాగుతున్నాడు. గత రెండు సీజన్లో లక్నో జట్టు ప్లే ఆఫ్ వైపు దూసుకెళ్లింది. ఈ సీజన్లో లక్నో జట్టు ధాటిగానే ఆడింది. ఈసారి కూడా ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్తుందని అందరూ భావించారు. కానీ ఎందుకనో ఆ జట్టు ఒక్కసారిగా తడబడుతోంది. గత రెండు మ్యాచ్లలో భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్లో గెలిచినా లక్నో ప్లే ఆఫ్ వెళ్తుందనే నమ్మకం లేదు.

ఈ సీజన్లో దారుణమైన ఆటతీరు ప్రదర్శించిన నేపథ్యంలో, వచ్చే సీజన్ కు సంబంధించి కొత్త కెప్టెన్ ను లక్నో జట్టు నియమిస్తుందని ప్రచారం జరుగుతోంది. 2025లో మెగా వేలం జరుగుతుంది. రిటైన్ చేసుకునే విధానంలో భాగంగా లక్నో రాహుల్ ను తన వద్ద ఉంచుకునే అవకాశాలు లేవని వార్తలు వినిపిస్తున్నాయి. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 17 కోట్లు వెచ్చించి లక్నో కె.ఎల్ రాహుల్ ను కొనుగోలు చేసింది.. అయితే హైదరాబాద్ జట్టు చేతిలో ఓటమి నేపథ్యంలో.. లక్నో ఓనర్ సంజీవ్ ఫైర్ కావడంతో.. రాహుల్ లక్నోను విడిచిపెట్టి వచ్చేందుకే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మ్యాచ్ అనంతరం సంజీవ్, రాహుల్ ఏం మాట్లాడుకున్నారో ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు. కానీ రకరకాల ప్రచారాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాహుల్ 12 మ్యాచ్లు ఆడాడు. 460 రన్స్ చేశాడు. ఇందులో అతడి స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ ఆడుతున్న తీరు టి20 ఫార్మాట్ కు పెద్దగా సరిపోదు. మరోవైపు టి20 వరల్డ్ కప్ లో రాహుల్ కు అవకాశం లభించలేదు. అది కూడా అతడి కెప్టెన్సీ పై ప్రభావం చూపించిందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోయినంత మాత్రానా, రాహుల్ ను తక్కువ చేసి చూడొద్దని.. మిగతా రెండు మ్యాచ్లలో లక్నో ను గెలిపించి ప్లే ఆఫ్ తీసుకెళ్తాడని ఆ జట్టు అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నారు.