https://oktelugu.com/

Body Fat : అధికంగా కొవ్వు ఉందా? అయితే వీటికి దూరంగా ఉండండి..

కొవ్వు ఉండకూడదు అంటే జంక్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోండి. ఇతర పదార్థాల జోలికి వెళ్లకండి.

Written By:
  • NARESH
  • , Updated On : May 9, 2024 10:00 pm
    AF-COMPOSITE-EXCESS1-1

    AF-COMPOSITE-EXCESS1-1

    Follow us on

    Body Fat : ఈ మధ్య చాలా మందిలో కొవ్వు సమస్య విపరీతంగా పెరుగుతుంది. దాన్ని నివారించడానికి చాలా కష్టాలు పడుతున్నారు. జిమ్, వాకింగ్, వ్యాయామం, డైట్ లు అంటూ అష్టకష్టాలు పడుతున్నారు. కానీ కొందరు సీరియస్ గా చేస్తే మరికొందరు గ్యాప్ లు తీసుకుంటూ చేస్తుంటారు. దీని వల్ల ఫలితం శూన్యంగా ఉంటుంది. ఇక మీరు కూడా కొవ్వుతో బాధ పడుతున్నారా? మరి మీ శరీరంలో ఉన్న కొవ్వు ఇట్టే కరగాలి అంటే ఏం చేయాలో ఓ సారి చూడండి.

    కొన్ని ఆహారాలను పరిగడుపున అసలు తినకూడదు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక శరీరంలో పేరుకున్న కొవ్వు వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ ఆహారం తీసుకొని తక్కువ పని చేస్తే కచ్చితంగా కొవ్వు పెరుగుతుంటుంది. ఈ అధిక కొవ్వు కారణంగా రక్తనాళాలు బ్లాక్ అయ్యి గుండె పోటు వచ్చే సమస్య కూడా ఉంటుంది. అంతేకాదు ఈ కొవ్వు వల్ల జీర్ణక్రియకు సంబంధించిన చాలా సమస్యలు వస్తుంటాయి.

    మనం తినే ఆహారంలో ఎప్పుడు కూడా ఒకే రకమైన నూనెను వాడకూడదు. రెండు రకాల నూనెలను కలిపి ఉపయోగిస్తే అధిక కొవ్వుకు చెక్ పెట్టవచ్చు. ఆయిల్ ఫుడ్ ల కంటే పండ్లు, కూరగాయలు వంటివి తీసుకోవాలి. వీటి వల్ల ఆరోగ్యానికి శక్తితో పాటు కొవ్వు కూడా అదుపులో ఉంటుంది. బయట ఫుడ్ వీలైనంత తగ్గిస్తే కొవ్వుకు దూరంగా ఉండవచ్చు.

    రోజు మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఉల్లిపాయలు తినడం మంచిది. ఆరోగ్యం కోసమని జీడిపప్పులు, వేరుశనగలను మాత్రం ఎక్కువగా తినవద్దు. కొవ్వు ఉండకూడదు అంటే జంక్ ఫుడ్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి అని గుర్తు పెట్టుకోండి. ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారాలను మాత్రమే తీసుకోండి. ఇతర పదార్థాల జోలికి వెళ్లకండి.