Lord’s Ground Vs Arun Jaitley Stadium: పిండి కొద్ది రొట్టె అనే సామెత మనకు అనేక సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటుంది. అంటే దీని ప్రకారం మనం ఎంత పిండి ఉపయోగిస్తే ఆ స్థాయిలో రొట్టెలు తయారు చేయవచ్చు. కానీ పిండి ఎక్కువైనా రొట్టె పరిమాణం అత్యంత తక్కువ స్థాయిలో ఉంటే దానిని ఏమనాలి? ఒకవేళ దానికి పేరు పెడితే.. ఎలాంటి పేరు పెట్టాలి?
ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఇంగ్లీష్ దేశంలోని లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. ఈ పోటీ ఆసక్తికరంగా సాగుతోంది. మొత్తానికి చరిత్రలో తొలిసారిగా ప్రోటీస్ జట్టు టెస్ట్ గదను సొంతం చేసుకోవడానికి వీరోచితమైన పోరాటాన్ని ప్రదర్శిస్తోంది. బలమైన కంగారు జట్టును ఓడగొట్టడానికి ఇంకా 69 రన్స్ దూరంలో మాత్రమే ఉంది. ఇది లాంచనమే అయినప్పటికీ.. కంగారు జట్టు చివరి క్షణంలో ఏదైనా చేస్తుంది కాబట్టి.. అద్భుతం జరగడానికి ఆస్కారం కూడా ఉంది. అంటే మొత్తంగా టెస్ట్ మ్యాచ్ కూడా అసలు సిసలైన క్రికెట్ ఆనందాన్ని అందించబోతోంది. ఇప్పటికే మూడు రోజులపాటు జరిగిన మ్యాచ్ అభిమానులకు అసలు సిసలైన క్రికెట్ మజా అందించింది.
Also Read: India vs England 2nd Test: ఇంగ్లండ్ పై టీమిండియా గెలవడానికి ప్రధాన కారణం ఇదే
ఈ మ్యాచ్ సంగతి కాస్త పక్కన పెడితే.. లార్డ్స్ మైదానానికి సంబంధించి అనేక దృశ్యాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. మ్యాచ్ ఫాలో అవుతున్న వారు టీవీలలో ఆ దృశ్యాలు చూసే ఉంటారు. ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో లార్డ్స్ మైదానం పచ్చికతో, అత్యాధునికమైన భవనాల సముదాయంతో కనిపిస్తోంది. ఒక రకంగా ఆదృశ్యం హాలీవుడ్ సినిమాలను మించి ఉంది. వాస్తవానికి ప్రేక్షకులు కూర్చునే సీట్లు.. బాక్స్ గ్యాలరీ.. మ్యాచును ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయడానికి అందుబాటులో ఉండే విలేకరులు.. మ్యాచ్ చూసేందుకువచ్చే అతిరథ మహారథులు.. వారందరి కోసం ప్రత్యేకమైన సీట్లను కేటాయించారు. ఇక గ్యాలరీ అయితే అద్భుతంగా ఉంది. క్రికెటర్లు సేద తీరే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఒక రేంజ్ లో ఉంది. లార్డ్స్ మైదానాన్ని చూస్తూ ఉంటే అది ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా కనిపిస్తోంది. కొన్ని సందర్భాల్లో అయితే ఆటగాళ్లు హోటల్ గదులకు వెళ్లకుండా అక్కడి మైదానంలోనే ఉండిపోతారేమో అనే భావన కలుగుతోంది.
ఇంతటి స్థాయిలో సౌకర్యాలు ఉన్నప్పటికీ ఈ మైదానం నిర్మించడానికి 500 కోట్లు ఖర్చయిందట. వాస్తవానికి ఆ మైదానం స్వరూపం చూస్తే అంతకుమించి ఖర్చు అవుతుంది అనిపిస్తుంది.. కానీ 500 కోట్లతోనే ఆ మైదాన నిర్మాణాన్ని పూర్తి చేశారు. కేవలం అధునాతనమైన భవంతులు మాత్రమే కాదు.. అద్భుతమైన చెట్లు, పచ్చిక బయళ్లు ఆ మైదానం వద్ద ఉన్నాయి. మ్యాచ్ చూసే ప్రేక్షకులకు అద్భుతమైన సౌకర్యాలు ఉన్నాయి. అందువల్లే లార్డ్స్ అనేది క్రికెట్ మక్కాగా పేరుపొందింది. ఇక ఇదే సమయంలో నెటిజన్లు లార్డ్స్ మైదానాన్ని, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానాన్ని పోల్చి చూపిస్తున్నారు. అరుణ్ జెట్లీ మైదానం నిర్మాణానికి 19 వేల కోట్ల దాకా ఖర్చయింది. ఆ స్థాయిలో ఖర్చుపెట్టినప్పటికీ స్టేడియం నిర్మాణం అంతగా ఆకట్టుకోలేకపోతోంది. ప్రేక్షకుల కోసం కేటాయించిన సీట్లు, ఇతర సౌకర్యాలు అధమ స్థాయిలో ఉన్నాయి. వాస్తవానికి మైదానం రూపు కూడా అత్యంత దారుణంగా ఉంది. ఇక లార్డ్స్ మైదానానికి వస్తే అపురూపమైన దృశ్యం లాగా కనిపిస్తోంది. క్రికెట్ ను ఆటలాగా చూసిన దేశంలో మైదానాలు ఇలా ఉంటే.. క్రికెట్ ను కమర్షియల్ వస్తువుగా మార్చేసిన దేశంలో మైదానాలు ఇంత దరిద్రంగా ఉన్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు.