IPL Auction 2022: ఇండియాలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజే వేరు. ఈ సీజన్ వచ్చిందంటే చాలు అందరికీ పెద్ద పండుగ అన్నట్టే చెప్పుకోవాలి. అయితే ఐపీఎల్ ఈ సీజన్‌కు సంబంధించిన వేలం నిన్నటి నుంచి కొనసాగుతోంది. కాగా ఈ వేలంలో చాలా చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. దిగ్గజాలు అనుకున్న వారిని పక్కన పెడుతున్నాయి ప్రాంచైజీలు. అదే సమయంలో ఎవరూ ఊహించని వారికి కోట్లు కుమ్మరిస్తున్నాయి.
ఈరోజు కూడా వేలం కొనసాగుతోంది. ఇందులో ఇంగ్లండ్ హిట్టర్ అయిన లియామ్ లివింగ్ స్టోన్ ఈ రోజు అత్యధిక ధర పలికాడు. అతన్ని రూ.10.5కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. అయితే అదే ఇంగ్లండ్‌కు చెందిన పొట్టి ఫార్మాట్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను మాత్రం ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా ఇతనితో పాటు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన ఆరోన్ పింఛ్ ను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు.
Also Read:బీజేపీ కొత్త స్ట్రాటజీ.. ఏపీకి ప్రత్యేక హోదా ఖాయమా..?
ఇక ముంబై ఇండియన్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ అయిన సౌరభ్ తివారీతో పాటు, టెస్టుల్లో స్టార్ అనిపించుకున్న ఛతేశ్వర్ పుజారాను కూడా ఎవరూ కొనుగోలు చేయలేదు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ అయిన స్మిత్‌ను పంజాబ్ రూ.6 కోట్లకు దక్కించుకుంది. కాగా మార్కో జెన్ సన్‌ను సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ రూ.4కోట్లకు దక్కించుకుంది.
ఇక్కడ మరో ఆసక్తికర విషయం కూడా ఉందండోయ్.. అదేంటంటే.. గతేడాది కృష్ణప్ప గౌతమ్‌ను దాదాపు రూ.9.25కోట్లకు చెన్నై కొనుగోలు చేసింది. ఈసారి అతని రేటు దారుణంగా పడిపోయింది. కేవలం రూ.90లక్షలకు లక్నో జట్టు దక్కించుకుంది. ఇలా ఐపీఎల్ వేలంలో అనూహ్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తోపులు అవుతారనుకున్న వారు పక్కకు పోయి.. ఇతరులకు బంగారు బాట వేస్తున్నాయి ప్రాంచైజీలు.
Also Read: కేసీఆర్ లో నిజంగానే భయం పట్టుకుందా?