BJP: ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశంపై రోజుకో వార్త చెక్కర్లు కొడుతోంది. అయితే రాజకీయాల్లో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు కదా. అందుకే బీజేపీ కూడా ఈ విషయంలో కొంత తగ్గుతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ అంశాన్ని పరిశీలనలోకి తీసుకున్నట్టు సమాచారం. అయితే హోదా అంశంపై చాలా రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంట.
ఎందుకంటే ఇప్పటికే బీజేపీకి చాలా రాష్ట్రాల్లో షాక్ తగులుతోంది. పైగా ఇప్పుడు దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో కీలకమైన యూపీ కూడా ఉంది. అయితే ఈ రాష్ట్రాల్లో ఏమైనా ఎదురు గాలులు వీస్తే మాత్రం బీజేపీ ప్రత్యేక హోదాకు తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీహార్‌కు ఎలాగూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం బీజేపీకి ఉంది.
Also Read: కొత్త ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్న సమంత.. ఆమె ఎవరంటే..?
కాబట్టి బీహార్ తో పాటు ఏపీకి కూడా ఇవ్వాలని భావిస్తోందంట. అది కూడా మార్చి నెలాఖరు వరకు ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందంట. ఎందుకంటే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజార్టీ వస్తుందనే నమ్మకం బీజేపీకి లేదు. అందుకే ఈ సారి దక్షిణాది రాష్ట్రాల పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోందంట. దేశంలోనే వైసీపీ నాలుగో అతి పెద్ద పార్టీగా ఉంది.
కాబట్టి వైసీపీతో పొత్తు పెట్టుకుంటే.. కొంచెం మెజార్టీ తక్కువగా వచ్చినా ఇలాంటి లోకల్ పార్టీలను కలుపుకుని పోయి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది బీజేపీ. కాగా హోదా ఎవరు ఇస్తే వారికే మా సపోర్టు అంటూ ఇప్పటికే జగన్ సంకేతాలు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ విషయం మీద మార్చి ఆఖరు వరకు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఆ భయంతోనే కేసీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా..?