Homeక్రీడలుLionel Messi FIFA Record: 16 గోల్స్.. మెస్సి అంటేనే ఓ మాయ..ఫిఫా లో సరికొత్త...

Lionel Messi FIFA Record: 16 గోల్స్.. మెస్సి అంటేనే ఓ మాయ..ఫిఫా లో సరికొత్త రికార్డు

Lionel Messi FIFA Record: ఫుట్బాల్ చరిత్రలో మెస్సికి ప్రత్యేకమైన అధ్యాయాలు ఉంటాయి. ఎందుకంటే అతడి గేమ్ ప్లాన్ అలా ఉంటుంది. బంతిని ఎలాగైనా గోల్ పోస్టులోకి పంపిస్తుంటాడు. మైదానంలో పాదరసం మాదిరిగా కదులుతూ ఉంటాడు. బంతిని చాకచక్యంగా తప్పిస్తూ ఉంటాడు. ప్రత్యర్థులకు చిక్కకుండా.. వారి వ్యూహాలకు దొరకకుండా గోల్స్ చేస్తూ ఉంటాడు. అందువల్లే అతడిని గోట్ అని పిలుస్తుంటారు.

ప్రస్తుత ఫిఫా కప్ లో కూడా మెస్సి అదరగొడుతున్నాడు. అర్జెంటీనా జట్టు తరుపున సంచలనాలు సృష్టిస్తున్నాడు.. తాజాగా టెక్సాస్ లోని డాలస్ స్టేడియంలో ఆస్ట్రియా జట్టు జరిగిన మ్యాచ్లో అర్జెంటీనా అద్భుతమైన విజయం అందుకుంది. రెండు గోల్స్ తేడాతో విక్టరీ సాధించింది. ఈ రెండు గోల్స్ కూడా అర్జెంటీనా ఆటగాడు మెస్సి నుంచి వచ్చాయి. అతడు బిగినింగ్ నుంచి చివరి వరకు ఒకటే టెంపోలో ఆడాడు. బంతిని ఎక్కువ శాతం తన వద్ద ఉంచుకున్నాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ ఆస్ట్రియా ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.

ఆస్ట్రియా మీద రెండు గోల్స్ చేయడం ద్వారా మెస్సి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ (19) సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆస్ట్రియాతో జరిగిన మ్యాచ్లో 38వ నిమిషంలో గోల్ చేసి.. సరికొత్త రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు. తద్వారా జర్మనీ ఆటగాడు క్లోస్(16) రికార్డును అధిగమించాడు. ఆ తర్వాత మరొక గోల్ కూడా చేసి మెస్సి సరికొత్త చరిత్ర తన పేరు మీద రాసుకున్నాడు. ఫిఫా టోర్నీలలో వరుసగా ఆరు మ్యాచ్లలో గోల్స్ సాధించిన మూడవ ఆటగాడిగా మెస్సి ఘనత సొంతం చేసుకున్నాడు.

మెస్సి కంటే ముందు ఫ్రాన్స్ ఆటగాడు ఫాంటైన్, బ్రెజిల్ ఆటగాడు జైర్ ఈ ఘనత సృష్టించారు. మెస్సి ప్రస్తుత వరల్డ్ కప్ లో తిరుగులేని ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అర్జెంటీనా జట్టులో మిగతా ప్లేయర్లు కేవలం ప్రేక్షక పాత్ర పరిమితమవుతుంటే.. మెస్సి మాత్రం మెస్మరైజ్ చేస్తున్నాడు.. యంగ్ ప్లేయర్లు కూడా అసూయ పడేవిధంగా గోల్స్ చేస్తూ సత్తా చాటుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular