https://oktelugu.com/

Paris Olympics 2024: అడుగడుగునా కష్టాలు.. ప్రతి మలుపులోను కన్నీళ్లు.. వంద మీటర్ల పరుగు పందెం విజేత బతుకు చిత్రం ఇదీ..

2004 తర్వాత 100 మీటర్ల పరుగు పందెంలో అమెరికా ఒలింపిక్ విజేతగా నిలవలేదు. అయితే ఈసారి లైల్స్ విజేతగా నిలిచి అమెరికా పతాకాన్ని సగర్భంగా ఎగరేశాడు. లైల్స్ తల్లిదండ్రులు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు.. అయితే మొదట లైల్స్ జిమ్నాస్టిక్స్ ను పెంచుకున్నాడు. 2016 ఒలింపిక్స్ లో ఓ స్ప్రింటర్ పరుగు చూసి తను కూడా ఆ క్రీడలోకి అడుగు పెట్టాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 6, 2024 12:42 pm
    Follow us on

    Paris Olympics 2024 : నోవా లైల్స్.. పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించాడు. 2004 తర్వాత అమెరికాను ఛాంపియన్ గా నిలిపాడు. ఈ క్రమంలో అతడి జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అతని నేపథ్యం గురించి తెలుసుకున్నతర్వాత నెటిజన్లు సానుభూతి ప్రకటిస్తున్నారు. అతడు చెబుతున్న మాటలను విని ప్రేరణ పొందుతున్నారు. ఇంతకీ లైల్స్ ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? ఇక్కడ దాకా రావడానికి తనను తాను ఎలా ఆవిష్కరించుకున్నాడు? చివరికి పారిస్ ఒలంపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో సగం దూరం పూర్తయ్యేసరికి ఏడవ స్థానంలో ఉన్న లైల్స్.. ఒక్కసారిగా విజేతగా ఎలా నిలిచాడు? వీటన్నింటిపై ప్రత్యేక కథనం.

    చిన్నపాటి జ్వరం వస్తేనే..

    చిన్నపాటి జ్వరం వస్తే ఇబ్బంది పడుతుంటాం. అదేపనిగా తలనొప్పి ఇబ్బంది పెడుతుంటే నరకం చూస్తాం. అలాంటిది అతడికి రాయడం కష్టం. చదవడం అంతకన్నా కష్టం. జ్ఞాపకశక్తి పెద్దగా ఉండదు. వీటికి ఆందోళన, కొంగు బాటిలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ అతడు అధిగమించాడు. సరికొత్త చాంపియన్ గా నిలిచాడు. ఒలింపిక్ చరిత్రలోనే సరికొత్త ఘనత సృష్టించాడు. జమైకా స్ప్రింటర్ బోల్ట్ లాగా మెరిశాడు. సరికొత్త ధ్రువతారగా ఆవిర్భవించాడు. విజేతగా నిలిచిన తర్వాత “మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. కొంతమంది మిమ్మల్ని పిచ్చివాళ్లనే ముద్ర వేయొచ్చు. సూటిపోటి మాటలు అనొచ్చు. ఇంకా వెకిలి వ్యాఖ్యలు చేయవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీపై మీరు నమ్మకాన్ని పోగొట్టుకోకండి. సానుకూల దృక్పథం ఉంటే ఏదైనా సాధించవచ్చని” నోవా లైల్స్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

    2004 తర్వాత..

    2004 తర్వాత 100 మీటర్ల పరుగు పందెంలో అమెరికా ఒలింపిక్ విజేతగా నిలవలేదు. అయితే ఈసారి లైల్స్ విజేతగా నిలిచి అమెరికా పతాకాన్ని సగర్భంగా ఎగరేశాడు. లైల్స్ తల్లిదండ్రులు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు.. అయితే మొదట లైల్స్ జిమ్నాస్టిక్స్ ను పెంచుకున్నాడు. 2016 ఒలింపిక్స్ లో ఓ స్ప్రింటర్ పరుగు చూసి తను కూడా ఆ క్రీడలోకి అడుగు పెట్టాడు. అందులో రాటు తేలాడు. కోవిడ్ సమయంలో తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. మానసిక సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు. 2020లో అమెరికాలో జార్జ్ ప్లాయిడ్ అనే నల్ల జాతీయుడు హత్యకు గురయ్యాడు. ఆ సమయంలో అమెరికా వ్యాప్తంగా సాగిన ఉద్యమం లైల్స్ ను కుంగతీసింది. అందువల్ల అతడు టోక్యో ఒలింపిక్స్ లో 100 మీటర్ల పరుగు పందెంలో అర్హత సాధించలేకపోయాడు. 200 మీటర్ల పరుగు పోటీలో కాంస్యం దక్కించుకున్నాడు. ఆ తర్వాత మరింత బలవంతుడిగా మారాడు.

    సాధించాడు

    గత ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో 100 మీటర్లు, 200 మీటర్లతో పాటు 4*100 ఇతరుల రిలే పోటీలోనూ గోల్డ్ మెడల్స్ సాధించాడు. 2015లో బోల్ట్ అనంతరం ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్ గా లైల్స్ నిలిచాడు. బోల్ట్ ను విపరీతంగా ఆరాధించే లైల్స్.. ప్రస్తుత ఒలింపిక్స్ లో 200 మీటర్ల పరుగు పందెం పై కూడా దృష్టి సారించాడు. ఇందులో స్వర్ణం గెలుచుకోవాలని భావిస్తున్నాడు..4*100 రిలే పోటీలోనూ పాల్గొంటున్నాడు. ఇప్పటివరకు ప్రపంచ ఛాంపియన్ షిప్స్ లో ఆరు స్వర్ణాలు గెలిచాడు. డైమండ్ లీగ్ లో ఐదుసార్లు విజేతగా ఆవిర్భవించాడు.