IPL Mega Auction 2025: ఐపీఎల్ మెగా వేలంలోకి దిగ్గజ ఆటగాళ్లు.. SRH కు అతడు, RCB కి ఇతడు..పూర్తి రిటైన్ లిస్ట్ ఇదే..

కీలకమైన నలుగురు ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకున్న తర్వాత.. మిగతా వారిని మొత్తం ఆయా జట్లు వదిలిపెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వేలంలోకి చాలామంది దిగ్గజ ఆటగాళ్లు వస్తారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 9:01 am

IPL Mega Auction 2025

Follow us on

IPL Mega Auction 2025: ఐపీఎల్ 17వ సీజన్ విజయవంతంగా ముగిసింది. కోల్ కతా విజేతగా ఆవిర్భవించింది. చెన్నై వేదికగా హైదరాబాద్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. ఈ సీజన్ పూర్తి కాగానే.. 2025 కు సంబంధించి ఐపీఎల్ మెగా వేలం గురించి చర్చ మొదలైంది.. వచ్చే సీజన్ కు మెగా వేలం నిర్వహిస్తుండడంతో.. రిటైన్ విధానం అత్యంత ప్రాధాన్యత అంశంగా మారిపోయింది. ఈ ప్రకారం ఒక జట్టు కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే తన వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది.

కీలకమైన నలుగురు ఆటగాళ్లను తమ వద్ద ఉంచుకున్న తర్వాత.. మిగతా వారిని మొత్తం ఆయా జట్లు వదిలిపెట్టాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వేలంలోకి చాలామంది దిగ్గజ ఆటగాళ్లు వస్తారు. అప్పుడు ఆయా జట్ల ముఖచిత్రాలు మారిపోతాయి. ఫలితంగా వచ్చే సీజన్లో పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది.. ఈ ఏడాది సీజన్లో కోల్ కతా విజేతగా ఆవిర్భవించింది. అలాగని ఆ జట్టు ఈ ఏడాది విన్నింగ్ టీం లోని ఆటగాళ్లను తన వద్ద ఉంచుకునేందుకు అవకాశం లేదు. ఆ టీంలోని నలుగురు ఆటగాళ్లు మినహా మిగతా వారందరినీ ఆ జట్టు వదిలేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారంతా మెగా వేలంలోకి వెళ్ళిపోతారు. కేవలం కోల్ కతా మాత్రమే కాదు అన్ని జట్ల పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఈ ప్రకారం పది జట్లు ఎవరిని తమతో పాటు ఉంచుకుంటాయనే దానిని ఒకసారి పరిశీలిస్తే..

కోల్ కతా నైట్ రైడర్స్

సునీల్ నరైన్, శ్రేయస్ అయ్యర్, అండ్రీ రసెల్, రింకూ సింగ్/ వెంకటేష్ అయ్యర్.

చెన్నై సూపర్ కింగ్స్

రవీంద్ర జడేజా, మతిషా పతిరణ, శివం దుబే, రుతు రాజ్ గైక్వాడ్.

ఢిల్లీ క్యాపిటల్స్

కులదీప్ యాదవ్, రిషబ్ పంత్, త్రిస్టన్ స్టబ్స్, జేక్ ఫ్రెజర్ మెక్ గుర్క్.

గుజరాత్ టైటాన్స్

రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, శుభ్ మన్ గిల్, మహమ్మద్ షమీ.

లక్నో సూపర్ జెయింట్స్

మాయాంక్ యాదవ్, నికోలస్ పూరన్, మార్కస్ స్టోయినిస్, క్వింటన్ డికాక్

పంజాబ్ కింగ్స్

శశాంక్ సింగ్, ఆర్ష్ దీప్ సింగ్, సామ్ కరణ్, అశుతోష్ శర్మ.

రాజస్థాన్ రాయల్స్

రియాన్ పరాగ్, జోస్ బట్లర్, ట్రెంట్ బౌల్ట్, సంజూ శాంసన్.

హైదరాబాద్

క్లాసెన్, ట్రావిస్ హెడ్, కమిన్స్, అభిషేక్ శర్మ.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

మహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్, రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ.

ఒకవేళ రోహిత్ శర్మ, రాహుల్ మెగా వేలంలోకి అందుబాటులోకి వస్తే.. రోహిత్ శర్మను హైదరాబాద్, రాహుల్ ను బెంగళూరు జట్లు కొనుగోలు చేయాలనే అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు.. రాహుల్ ను లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయాంక దూషించడం.. రోహిత్ శర్మను ముంబై జట్టు యాజమాన్యం కెప్టెన్ పదవి నుంచి పక్కన పెట్టడం.. వంటి పరిణామాలతో.. కచ్చితంగా వారిద్దరూ మెగా వేలంలోకి వస్తారని అభిమానులు అంచనా వేస్తున్నారు.