VVS Laxman: ఒకప్పుడు టీమిండియా క్రికెట్ గురించి కొన్ని విషయాలు మాత్రమే తెలిసేవి. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టీమ్ ఇండియా క్రికెట్ గురించి ప్రతి విషయం తెలుస్తోంది. పైగా సంచలన విషయాలేకుండానే ఎటువంటి దాపరికం లేకుండానే వెలుగులోకి వస్తున్నాయి.. తాజాగా అటువంటి ఓ విషయం ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రధాన మీడియాను సైతం షేక్ చేస్తోంది.
టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. అతడి శిక్షణలో టీమిండియా టెస్ట్ ఫార్మేట్ లో దారుణంగా విఫలమవుతోంది. స్వదేశంలో కూడా వైట్ వాష్ లకు గురవుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టీం ఇండియాను వైట్ వాష్ చేశాయి.. విదేశాలలో టీమిండియా ఒక్క ట్రోఫీ కూడా సంపాదించలేకపోయింది.. ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ ను సమం చేయాల్సి వచ్చింది. బంగ్లాదేశ్, వెస్టిండీస్ పై మాత్రమే టీమిండియా ట్రోఫీలు అందుకుంది. అది కూడా స్వదేశంలో మాత్రమే.
భారత జట్టు ఇంత దారుణంగా ఆడుతున్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ మీద తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. టీమిండియా ఒకప్పటిలాగా టెస్ట్ క్రికెట్లో సత్తా చూపించాలంటే గౌతమ్ గంభీర్ ను తొలగించాలని మెజారిటీ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్ల సైతం గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి పట్ల అంత సుముఖంగా లేరు. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా గౌతమ్ గంభీర్ తప్పుకోవాలని కథనాలను ప్రసారం చేస్తున్నాయి.. కొంతమంది మాజీ క్రికెటర్లైతే ఏకంగా గౌతమ్ గంభీర్ తన పదవి నుంచి మర్యాదగా తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థలో ఓ కథనం ప్రసారమైంది. ఆ కథనం సారాంశం ప్రకారం టీమ్ ఇండియా తదుపరి కోచ్ గా తెలుగోడు వివిఎస్ లక్ష్మణ్ ఎంపిక అవుతాడని తెలుస్తోంది. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని ఆ కథనం సారాంశం. అయితే గౌతమ్ గంభీర్ పదవి కాలం చాలా రోజుల వరకు ఉంది. అలాంటప్పుడు అతడిని ఆ పదవి నుంచి తొలగించే అవకాశం లేదని తెలుస్తోంది. టీమిండియా ఓడిపోయినంత మాత్రాన మేనేజ్మెంట్ అటువంటి చర్యలు తీసుకోదని.. కచ్చితంగా అతడికి అవకాశాలు ఇస్తుందని.. నిబంధనల ప్రకారం అతడి స్థానంలో వివిఎస్ లక్ష్మణ్ ను తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. టెస్ట్ క్రికెట్లో వివిఎస్ లక్ష్మణ్ అద్భుతమైన రికార్డులు సాధించాడు. రాహుల్ ద్రావిడ్ తో కలిసి సరికొత్త భాగస్వామ్యాలు నిర్మించాడు. అతడి శిక్షణలో టీమిండియా టెస్ట్ ఫార్మాట్లో నెంబర్ వన్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.
అయితే వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా ఉండేది కేవలం టెస్ట్ ఫార్మాట్ వరకేనని మరో వాదన వినిపిస్తోంది.. ప్రఖ్యాత ఈఎస్పిఎన్ స్పోర్ట్స్ లో ఓ కథనం కూడా పబ్లిష్ అయింది.. ఆ కథనం ప్రకారం వీవీఎస్ లక్ష్మణ్ టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియా కు శిక్షకుడిగా ఉంటాడు.. గౌతమ్ గంభీర్ మిగతా ఫార్మాట్లలో టీమిండియా కు శిక్షకుడిగా ఉంటాడు. అయితే దీనిపై అధికారికంగా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
BREAKING NEWS
ANNOUNCEMENT SOON
VVS Laxman can take over from Gautam Gambhir as the Indian Team Test cricket head coach. [Himansu Trivedi – EPSN Sports] pic.twitter.com/l8uSp0oyxm
— muffatball vikrant (@Vikrant_1589) December 10, 2025