Buddha Venkanna Fires On Kodali Nani: ఏపీలో రాజకీయాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. అధికార వైసీపీ మంత్రుల మాటల అయితే ముత్యాలలాగే ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ఎలాంటి కామెంట్ చేస్తారో మనం గతంలో చాలా చూశాం. అయితే మొన్న టీడీపీ ఏర్పడి 40 వసంతాలు గడిచిన సందర్భంగా చంద్రబాబు కొన్ని ఎమోషనల్ కామెంట్లు చేశారు. వీటిని కూడా కొడాలి నాని వక్రీకరించి మాట్లాడారు.

కోరి గెలుచుకోవడం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. చంద్రబాబు ఎన్టీఆర్ పేరు చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు అంటూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంకేముంది ఆయన కామెంట్లపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న దారుణమైన సెటైర్లు వేశారు. కొడాలి నానిని టీవీలో చూస్తుంటే చిన్న పిల్లలు, తల్లిదండ్రులు బూచోడు వచ్చాడని భయపడుతున్నారంటూ దారుణమైన కామెంట్లు చేశారు.
సినిమా ప్రదర్శనల కంటే ముందు వచ్చే ఖైనీ, గుట్కా ప్రకటనలకు బదులు కొడాలి నాని ప్రకటన వేయాలంటూ సెటైర్లు వేశారు. అంటే కొడాలి నాని చూడటానికి ఖైనీ, గుట్కాలు నమిలే వ్యక్తిలా ఉన్నాడంటూ బుద్ధ వెంకన్న ఇండైరెక్ట్ గా చెప్పాడన్నమాట. హరికృష్ణకు వెన్నుపోటు పొడిచి కొడాలి నాని లాభపడ్డారని, ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసంటూ రివర్స్ కౌంటర్ వేశారు బుద్ధా వెంకన్న.

ఈయన కామెంట్లు చూస్తుంటే కౌంటర్ కు రీ కౌంటర్ లాగే ఉంది. కొడాలి నాని కూడా ఇలాంటి కామెంట్లు చాలానే చేస్తుంటారు. అంటే ఎవరికీ ఏ ఈ పద్ధతిలో చెప్పాలో అలాగే చెబుతున్నారన్నమాట. ఈ పరిస్థితులను చూస్తుంటే కొడాలి నాని కోరి తిట్టిపించుకుంటున్నారని చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు. ప్రస్తుత రాజకీయాల్లో ఇలాంటి ట్రెండ్ చాలా ఎక్కువ అవుతుంది. ఒకప్పుడు ఎంత మంది పొగిడితే అంత గొప్ప లీడర్ అనేవారు. కానీ ఇప్పుడు ఏపీలో పరిస్థితులను చూస్తుంటే ఎంత ఎక్కువ మంది తిడితే అంత పెద్ద లీడర్ అని ఫీల్ అవుతున్నారు రాజకీయ నాయకులు.
Also Read: Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి
[…] […]
[…] Bank Holidays: మీకు బ్యాంకులో ఏదైనా పని ఉందా.. అయితే ఈరోజే వెళ్లి చేసేసుకోండి. ఎందుకంటే వరుసగా బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయి. అసలే ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కాబట్టి.. ప్రతి ఒక్కరికీ ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఇక కంపెనీలు, ఇతర సంస్థలు నడిపేవారికి అయితే బ్యాంకులతోనే ఇప్పుడు పని ఉంటుంది. […]