KKR Playoff Chances: 2024 లో ఛాంపియన్.. అంతకుముందు 2014లో విజేత.. బలమైన ఆటగాళ్లు.. ఆర్థిక సంపత్తి దండిగా ఉన్న మేనేజ్మెంట్.. కోచ్ నుంచి మొదలు పెడితే ఫీల్డ్ స్టాఫ్ వరకు అందరు ఉద్దండులు.. ఇన్ని రకాలుగా సానుకూలతలు ఉన్నప్పటికీ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు భవితవ్యం మారడం లేదు.. కనీసం గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు.
ఐపీఎల్ లో భాగంగా శుక్రవారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ మరో ఓటమిని ఎదుర్కొంది. ఇప్పటివరకు ఐపీఎల్లో రహానే బృందం ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ముందుగా బ్యాటింగ్ చేసి 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి, 19.4 ఓవర్ల లోనే ఫినిష్ చేసింది. ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో విఫలమైన కోల్ కతా జట్టు.. బౌలింగ్లో కూడా అదే ధోరణి కొనసాగించింది.. ఈ సిరీస్లో ఇప్పటివరకు కోల్ కతా జట్టు ఒక్క మ్యాచ్లో కూడా సమిష్టి ప్రదర్శన చేయలేకపోయింది. అందువల్లే ఆ జట్టు ఆట తీరు ఇంత దారుణంగా ఉంది.
పంజాబ్ తో జరగాల్సిన వర్షం వల్ల రద్దయింది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్లలో ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో అదమ స్థానంలో ఉంది. కోల్ కతా ప్రస్తుత ఐపీఎల్ లో ప్లే ఆఫ్ దాకా వెళ్లాలంటే తదుపరి ఎనిమిది మ్యాచ్లు మొత్తం గెలవాలి. అది కూడా భారీ అంతరంతో విజయం సాధించాలి. అప్పుడే ఆ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది..
కోల్ కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ చరిత్రలో ఎన్నడు కూడా ఇంతటి దారుణంగా ఓటములు ఎదుర్కోలేదు. ప్రత్యర్థి జట్ల ముందు తలవంచలేదు. కానీ, ఈసారి మాత్రం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తోంది. అసలు ఇలా ఎందుకు ఆడుతోంది.. జట్టు ప్లేయర్లకు ఏమైంది.. అనే సందేహాలు అభిమానులలో వ్యక్తమవుతున్నాయి.