https://oktelugu.com/

కోహ్లి ఉన్నన్ని రోజులు బెంగళూరుకు కప్‌ రాదంట

భారత జట్టుకు కెప్టెన్‌ సారథ్యంలో నడుస్తున్న జట్టుపై ఎవరికైనా హైప్‌ ఉంటుంది. భారత్‌ జట్టు తరఫున ఇతర దేశాలపై విరుచుకుపడే కోహ్లీ.. ఐపీఎల్‌లో మాత్రం తన ప్రతిభను చాటలేకపోతున్నాడు. చివరకు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. Also Read: కప్‌కు రెండడుగుల దూరంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 13 సీజన్‌ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కప్పు తమదేనన్న ధోరణితో కోహ్లి సేన బరిలోకి దిగింది. కానీ.. ఆ కల నెరవేరకుండానే వెనుదిరిగింది. దీంతో అభిమానులు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 11:46 AM IST
    Follow us on


    భారత జట్టుకు కెప్టెన్‌ సారథ్యంలో నడుస్తున్న జట్టుపై ఎవరికైనా హైప్‌ ఉంటుంది. భారత్‌ జట్టు తరఫున ఇతర దేశాలపై విరుచుకుపడే కోహ్లీ.. ఐపీఎల్‌లో మాత్రం తన ప్రతిభను చాటలేకపోతున్నాడు. చివరకు ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

    Also Read: కప్‌కు రెండడుగుల దూరంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్

    యూఏఈ వేదికగా ఐపీఎల్‌ 13 సీజన్‌ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈసారి కప్పు తమదేనన్న ధోరణితో కోహ్లి సేన బరిలోకి దిగింది. కానీ.. ఆ కల నెరవేరకుండానే వెనుదిరిగింది. దీంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. అంతేకాదు.. కోహ్లీ ఉన్నన్ని రోజులు బెంగళూరు ఈ లీగ్‌లో విజేతగా నిలవలేదని.. అతను టీమ్‌ ఇండియాకు కూడా పెద్ద కప్పులు సాధించలేడని సోషల్‌ మీడియాల్లో ట్రోల్‌ అవుతున్నాయి.

    నిన్నటి మ్యాచ్‌ ముగిసిన తర్వాత కోహ్లి సోషల్‌ మీడియా వేదికగా తన జట్టు బృందంతో కలిసి ఓ ఫొటోను షేర్‌‌ చేశాడు. ‘ఒడిదొడుకుల సమయాల్లో జట్టు సమష్టిగా ఉంది. ఒక బృందంగా ఈ ప్రయాణం చాలా గొప్పగా ఉంది. ఇక పరిస్థితులు మాకు అనుకూలంగా మారలేదనేది నాజమే. అయినా మా ఆటగాళ్ల పట్ల గర్వంగా ఉంది. ఎప్పటిలాగే మాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తాం’ అంటే పేర్కొన్నాడు.

    Also Read: క్రికెట్ లోగుట్టు: కోహ్లి.. రోహిత్‌లకు పడడం లేదా..!

    అబుదాబి వేదికగా ఈ జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓటర్లలో 131 పరుగులు చేసింది. డివిలియర్స్‌ హాఫ్‌ సెంచరీతో మెరవడంతో ఆ మాత్రమైనా స్కోర్‌‌ సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. కేన్‌ విలియమ్సన్‌ (50), జేసన్‌ హోల్డర్‌‌ (24) ఒత్తిడిలో రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.