https://oktelugu.com/

బిగ్ బాస్-4:రింగులో రంగు.. హరికకు ఎక్కడపడితే అక్కడ రంగుపూసిన మాస్టర్..!

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు బిగ్ బాస్ నుంచి బయటికి పోవడంతో గేమ్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ సైతం అలరించే టాస్కులు పెడుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్-4 ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ఈ వారం కెప్టెన్సీ ఎంపిక కోసం బిగ్ బాస్ ‘రింగులో రంగు’ టాస్క్ ప్లాన్ చేశాడు. ఆకట్టుకునేలా సాగిన గేమ్‌లో కంటెస్టెంట్లు తమ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 11:51 AM IST
    Follow us on

    బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్-4 ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలువురు కంటెస్టులు బిగ్ బాస్ నుంచి బయటికి పోవడంతో గేమ్ రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. బిగ్ బాస్ సైతం అలరించే టాస్కులు పెడుతూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బిగ్ బాస్-4 ప్రస్తుతం 9వ వారంలో కొనసాగుతోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఈ వారం కెప్టెన్సీ ఎంపిక కోసం బిగ్ బాస్ ‘రింగులో రంగు’ టాస్క్ ప్లాన్ చేశాడు. ఆకట్టుకునేలా సాగిన గేమ్‌లో కంటెస్టెంట్లు తమ టీషర్టుపై ఎక్కువగా రంగు పడకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. గేమ్ లో భాగంగా ఇంటి సభ్యులు నేలపైపడి తమ ప్రత్యర్థికి రంగు పూసేందుకు ప్రయత్నించారు.

    రింగులో రంగు టాస్క్ సందర్భంగా అరియానా.. హారిక.. అమ్మ రాజశేఖర్ దాదాపుగా కలియబడినంత పనిచేశాడు. చేతికి దొరకగానే అందినచోట అంతా పూసే ప్రయత్నం చేశారు. ఓ దశలో హారికపైకి మాస్టర్ దూకి ఎక్కడ పడితే అక్కడ పూసేశాడు. దీంతో హరిక షర్టుకు పూయాలే తప్ప.. శరీరంపై పడి దురుసుగా ప్రవర్తించవద్దు అంటూ బిగ్ బాస్ కు ఫిర్యాదు చేసింది.

    Also Read: హ్యపీ బర్త్ డే గురూజీ.. టాలీవుడ్లో త్రివిక్రమ్ జర్నీ..!

    గేమ్ లో భాగంగా అమ్మా రాజశేఖర్‌ను గెలిపించాలని అరియానా, అవినాష్, సోహైల్, మెహబూబ్ ప్లాన్ చేశారు. ఇక హారికకు అభిజిత్‌.. లాస్య.. అఖిల్ మద్దతుగా నిలిచారు. టాస్క్‌కు ముందే వ్యూహాలు రచించారు. రింగులోకి దూకిన తర్వాత హారికను అరియానా, అమ్మా రాజశేఖర్ టార్గెట్ చేసి ఎక్కువ రంగు పూశారు.

    అందరికీ కంటే తన టీషర్టుపై మాస్టర్ తక్కువ రంగు ఉంచుకోవడంతో అమ్మ రాజశేఖర్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. తనకు ఇష్టమైన మాస్టర్ కెప్టెన్ కావడంతో అరియానా ఎగిరి గంతేసి ఆయన చంకలోచేరి గట్టిగా కౌగిలించుకోవడంతోపాటు ముద్దులు పెట్టేసింది. దీంతో ప్రేక్షకులంతా షాక్ తిన్నారు.

    Also Read: సోనూ సూద్ ఇంత సాయం ఎందుకు చేస్తున్నాడో తెలుసా?

    గత వారం కెప్టెన్‌గా వ్యవహరించిన అరియానా తన వద్ద ఉన్న కెప్టెన్ బ్యాండ్‌ను మాస్టర్‌కు తొడగడంతో మాస్టర్ హ్యాపీగా ఫీలయ్యాడు. కెప్టెన్సీ కోసం జరిగిన ‘రింగులోరంగు’ మొత్తానికి బిగ్ బాస్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.