Jadeja: కోహ్లీ పోయిండు.. రోహిత్ గాయం.. ఇప్పుడు జడేజా కూడా బీసీసీఐకి షాక్

Jadeja: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీంఇండియా జట్టులో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య నెలకొన్న కెప్టెన్సీ వివాదం మరింత ముదిరినట్లు కన్పిస్తోంది. వీరిద్దరు ఎడమొఖం పెడముఖం పెడుతూ జట్టుకు దూరంగా ఉంటుండటం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలన్నీంటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ  చేసినా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో టీంఇండియాలో నెలకొన్న విబేధాలు మరోసారి బట్టబయలు అవుతున్నాయి.   దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీంఇండియా ఆజట్టుతో మూడు టెస్టులు, […]

Written By: NARESH, Updated On : December 15, 2021 11:22 am
Follow us on

Jadeja: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు టీంఇండియా జట్టులో అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ మధ్య నెలకొన్న కెప్టెన్సీ వివాదం మరింత ముదిరినట్లు కన్పిస్తోంది. వీరిద్దరు ఎడమొఖం పెడముఖం పెడుతూ జట్టుకు దూరంగా ఉంటుండటం అందరినీ ఆశ్యర్యానికి గురిచేస్తోంది. ఈ పరిణామాలన్నీంటికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు బీసీసీఐ  చేసినా ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో టీంఇండియాలో నెలకొన్న విబేధాలు మరోసారి బట్టబయలు అవుతున్నాయి.

team India

 

దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టీంఇండియా ఆజట్టుతో మూడు టెస్టులు, మూడు వన్డే మ్యాచులను ఆడనుంది. ఈనేపథ్యంలోనే టెస్ట్ జట్టుకు విరాట్ కోహ్లీని, వన్డే జట్టుకు రోహిత్ శర్మను కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటించింది. వన్డే కెప్టెన్ గా తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అవమానంగా ఫీలవుతున్నాడు. ఈనేపథ్యంలోనే కోహ్లీ బీసీసీఐకిగానీ, జట్టు సభ్యులకుగానీ అందుబాటులోకి రావడం లేదు. దీంతో అతడు టెస్టు సీరిసుకు వస్తాడా? రాడా? అన్న అనుమానాలు సైతం వ్యక్తమయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీసుకు దూరమయ్యాడు. ప్రాక్టీసు మ్యాచ్ లో తొడకండరాలు పట్టేయడంతో రోహిత్ టెస్టు సిరీసుకు దూరంగా ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. అతడి స్థానంలో ప్రియాంక్ పాంచాల్ ను ఎంపిక చేశామని రోహిత్ వన్డే సిరీసుకు అందుబాటులోకి వస్తాడని పేర్కొంది. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ వన్డే సిరీసుకు దూరంగా ఉంటాడనే వార్తలు విన్పిస్తున్నాయి.

వీరిద్దరి మధ్య నెలకొన్న మనస్పర్ధల కారణంగా టెస్ట్ సిరీసుకు రోహిత్ వర్మ, వన్డే సిరీసుకు విరాట్ కోహ్లీ దూరంగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా టీంఇండియాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆల్ రౌండర్ జడేజా టెస్టులకు గుడ్ బై చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు విన్పిస్తున్నాయి. వన్డే, టీ20 కెరీర్ ను ఎక్కువకాలం పొడగించుకునేందుకు వీలుగా 33ఏళ్ల జడేజా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించనున్నారని అతడి సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: వన్డే సిరీసుకు కోహ్లీ దూరం.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!

గత నెలలో న్యూజిల్యాండ్ తో జరిగిన టెస్ట్ సిరీసులో జడేజాకు గాయమైంది. దీంతో అతడిని దక్షిణాఫ్రికా టెస్టు సిరీసుకు ఎంపిక చేయలేదు. ఈనేపథ్యంలోనే అతడి టెస్ట్ సిరీసులకు రిటైర్మెమెంట్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. జడేజా ఇప్పటిదాకా 57 టెస్టులాడి 2,195 పరుగులు 232 పరుగులు తీశాడు. బౌలింగ్, బౌలింగ్ తో అలరించిన జడేజా టెస్టులకు దూరమవుతుండటంతో అభిమానులకు నిరాశ కలిగించనుంది.

అయితే కొద్దిరోజులుగా టీంఇండియాలో చోటుచేసుకున్న అనుహ్య పరిణామాలు జట్టుకు చేటుచేసేలా మారుతున్నాయి. కెప్టెన్సీ వివాదం కాస్తా ప్లేయర్స్ మధ్య చిచ్చుకు కారణమవుతోందని తెలుస్తోంది. ఈ వివాదానికి బీసీసీఐ, ప్లేయర్స్ ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతారో వేచిచూడాల్సిందే..!

Also Read: రోహిత్ వైదొలిగాడు.. కోహ్లీ నా వల్ల కాదన్నాడు.. టీమిండియా పరిస్థితేంటి?