https://oktelugu.com/

Virat Kohli 50 Century: విరాట్ కోహ్లీపై ప్రేమను చాటుకున్న జూ.ఎన్టీఆర్, రాజమౌళి..?

నిజానికి ఈ మ్యాచ్ లో కోహ్లీ సాధించిన సెంచరీ కి చాలా మంది ప్రముఖులు వల్ల బెస్ట్ విషెష్ ని తెలియజేశారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ స్టేడియం లోనే ఈ మ్యాచ్ చూస్తూ కోహ్లీ సెంచరీ చేసిన టైం లో తను స్టేడియం లో నిలబడి క్లాప్స్ కొట్టిన విజువల్స్ ను మనం చూశాం.

Written By:
  • Gopi
  • , Updated On : November 16, 2023 / 10:56 AM IST

    Virat Kohli 50 Century

    Follow us on

    Virat Kohli 50 Century: వరల్డ్ కప్ లో భాగంగా ఇండియన్ టీం న్యూజిలాండ్ తో ఆడిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇండియా టీం ఫైనల్ కి దూసుకెళ్ళింది. ఇక ఈ మ్యాచ్ లో కింగ్ కోహ్లీ తన 50వ సెంచరీ ని పూర్తి చేసుకున్నాడు. అయితే నవంబర్ 5వ తేదీన కోహ్లీ పుట్టినరోజు కావడంతో సౌతాఫ్రికా టీం మీద సెంచరీని చేసుకున్నాడు. అయితే ఇదే క్రమంలో అంతకుముందు సచిన్ చేసిన 49 సెంచరీల రికార్డును కోహ్లీ సమం చేశాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్ లో సెంచరీ చేసి వన్డేల్లో తను 50 వ సెంచరీ ని నమోదు చేసుకొని సచిన్ పేరు మీద ఉన్న రికార్డ్ ని బ్రేక్ చేశాడు.దాంతో వన్డే ఫార్మాట్ లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా విరాట్ కోహ్లీ చరిత్రలో నిలిచాడు. ఇక సచిన్ టెండూల్కర్ 452 మ్యాచుల్లో 49 సెంచరీలు సాధిస్తే, విరాట్ కోహ్లీ మాత్రం 278 ఇన్నింగ్స్ లోనే 50 సెంచరీలను సాధించి ఇండియన్ టీం లోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేశాడు.

    నిజానికి ఈ మ్యాచ్ లో కోహ్లీ సాధించిన సెంచరీ కి చాలా మంది ప్రముఖులు వల్ల బెస్ట్ విషెష్ ని తెలియజేశారు. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ స్టేడియం లోనే ఈ మ్యాచ్ చూస్తూ కోహ్లీ సెంచరీ చేసిన టైం లో తను స్టేడియం లో నిలబడి క్లాప్స్ కొట్టిన విజువల్స్ ను మనం చూశాం. అలాగే మ్యాచ్ అనంతరం కోహ్లీ ని కలిసి కంగ్రాట్స్ కూడా చెప్పాడు…

    ఇక సచిన్ తో పాటు తెలుగు హీరో అయిన వెంకటేష్ కూడా గ్రౌండ్ లో కోహ్లీ సెంచరీ చేసిన సమయం లో ఫ్యాన్స్ అందరి తో కలిసి అరుస్తూ కోహ్లీ కి కంగ్రాట్స్ చెప్పారు. నిజానికి వెంకటేష్ ఈ వరల్డ్ కప్ లో ఇండియా ఆడుతున్న ప్రతి మ్యాచ్ ని స్టేడియంకి వెళ్లి చూస్తూ టీమ్ ని చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు…ఇక నిన్న కోహ్లీ సెంచరీ చేసిన సందర్భం లో కొంత మంది సెలబ్రిటీస్ స్టేడియంలో లేకపోయిన కూడా సోషల్ మీడియా ద్వారా వాళ్లు కోహ్లీ కి కంగ్రాట్స్ చెప్పారు. అందులో ముఖ్యం గా ద ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ అయిన రాజమౌళి,అలాగే జూనియర్ ఎన్టీయార్, యంగ్ హీరో అయిన సాయి ధరమ్ తేజ లాంటి పలువురు తెలుగు సినీ సెలబ్రిటీస్ సైతం కోహ్లీ కి ట్విట్టర్ ద్వారా వాళ్ల అభినందనలు తెలియజేయడం జరిగింది…