Buying Car: ఇప్పుడున్న చాలా మంది కారు ప్రయాణించాలని గట్టిగా కోరుకుంటున్నారు. అప్పోసప్పో చేసి ఓ కారును అయితే ఇంటికి తెచ్చుకుంటున్నారు. కొందరు అనుకున్నదే తడవుగా అన్నట్లు వెంటనే కారును కొనుగోలు చేస్తారు. మరికొందరు మాత్రం పండుగ సీజన్ వరకు వేచి చూసి ఆ తరువాత ఆఫర్లు ప్రకటించిన తరువాత కారు కొంటారు. అయితే కారు కొనుగోలు చేయడం అంటే ఆషామాషీ కాదు. లక్షల్లో వ్యవహారం. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ధర విషయంలో కొన్ని కంపెనీలు తికమక పెట్టి భారీగా వసూలు చేస్తాయి . ముందుగా ఆఫర్లు ప్రకటించినప్పటికీ ఛార్జీల పెరిట అధికంగా డబ్బు తీసుకుంటారు. ఇలాంటిప్పుడు ఏం చేయాలి? ఎవరి సలహా తీసుకోవాలి?
కారు కొనాలని చాలా మందికి కోరిక ఉన్నా.. తక్కువ ధరలో ఇంటికి తెచ్చుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు భారీ ఆఫర్స్ ప్రకటిస్తాయి. పండుగల సీజన్లలో లక్షల వరకు తగ్గింపు చేస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే… ముందుగా ధర తగ్గించినట్లు ప్రకటించనప్పటికీ.. కారు కొనాలని షోరూం వెళ్లాక.. వివిధ చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తారు. ముఖ్యంగా ఆన్ రోడ్ ధరపై మాత్రమే తగ్గింపు అని కొందరు చెబుతారు. మిగతా ఛార్జీలు మాత్రం యథావిధిగా వసూలు చేస్తారు. అలా చేయడం వల్ల మీరు ఆఫర్లో కారు కొన్నా ఉపయోగం లేదు.
ఉదాహరణకు ఒక కారు రూ.8 లక్షలకు విక్రయిస్తున్నారనుకుందాం. ఆఫర్ల కింద కనీసం రూ.50వేలు తగ్గించారని ప్రకటించారు. దీంతో రూ.7.50 లక్షలకు కారు వస్తుందని అంతే మొత్తం పట్టుకొని వెళ్తాం. కానీ విక్రయదారులు ఈ తగ్గింపు కేవలం ఆన్ రోడ్ ధరకే అని చెబుతారు. ఆ తరువాత రోడ్డు పన్ను, బీమా, రిజిస్ట్రేషన్, ఇతర రుసుముల్లో అదనంగా వసూలు చేస్తారు. చాలా మంది వినియోగదారులు తక్కువ ధరకే కారు వస్తుందన్న సంతోషంలో ఇలాంటి వాటిపై పెద్దగా దృష్టి పెట్టరు. ఇవి తెలియకుండా లక్ష వరకు ఖర్చవుతాయి.
అందువ్లల ఆఫర్లోకారు కొనుగోలు చేసేటప్పుడు ఇలాంటి ధరలు అంతముందు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అని తెలుసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా ఆన్ రోడ్ ధర విషయంలో జాగ్రత్తలు ఉండాలి. ఆన్ రోడ్ ధర తగ్గింపు అని ప్రకటిస్తూనే.. కారు డెలివరీ ఇచ్చేటప్పుడు ఆ ఆఫర్ మొత్తాన్ని తెలియకుండా నే వసూలు చేసే అవకాశం ఉంది. అయితే ఇవి అన్ని కంపెనీలు చేయకపోవచ్చు. ఇందుకోసం ముందుగా ఆటోమోబైల్ రంగ నిపుణులన సంప్రదించడం మేలు.