https://oktelugu.com/

KL Rahul: ఆస్ట్రేలియా లో విఫలమవుతున్నప్పటికీ.. అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన కేఎల్ రాహుల్.. ఇంతకీ అది ఏంటంటే?

టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కంటే ముందు ఆస్ట్రేలియా - ఏ జట్టుతో భారత - ఏ జట్టు ఆడుతున్న అనధికారిక టెస్ట్ సిరీస్ లో తలపడుతున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 09:45 PM IST

    KL Rahul(4)

    Follow us on

    KL Rahul: ఆస్ట్రేలియా మైదానాలపై రాహుల్ ఆకట్టుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా రెండవ టెస్టులో దారుణమైన ఆట తీరు ప్రదర్శించాడు. మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు.. రెండవ ఇన్నింగ్స్ లో పది పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ముఖ్యంగా రెండవ ఆస్ట్రేలియా బౌలర్ రాకేచోళి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా టీమ్ ఇండియా తీవ్ర కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 161 పరుగులు చేసిన టీమిండియా.. రెండవ ఇన్నింగ్స్ లో ఇప్పటివరకు ఐదు వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. క్రీజ్ లో నితీష్ రెడ్డి (9), ధృవ్ జురెల్(19) ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా – ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 223 పరుగులకు ఆలౌట్ అయింది.

    అభిమానులకు శుభవార్త

    ఆస్ట్రేలియా గడ్డపై విఫలమౌతూ.. విమర్శల పాలవుతున్నప్పటికీ.. కేఎల్ రాహుల్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన సతీమణి అథియా శెట్టి.. గర్భం దాల్చిందని.. తమ త్వరలో పండంటి బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నామని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని రాహుల్ తో పాటు అథియా కూడా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. దీంతో అభిమానులు ఆ ఇద్దరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాహుల్, అథియా 2023 జనవరి నెలలో వివాహం చేసుకున్నారు.. అంతకుముందు చాలా ఏళ్లు వారిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇరువైపులా కుటుంబాలు అంగీకారం తెలపడంతో వారిద్దరు వివాహం చేసుకున్నారు. అథియా శెట్టి బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె. పెళ్లి సమయంలో సునీల్ శెట్టి ఆమెకు అత్యంత అరుదైన, విలువైన కానుకలు అందించారు. అప్పట్లో అవి సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొట్టాయి. ఇక టీమ్ ఇండియా క్రికెటర్లు కూడా రాహుల్ కు అత్యంత విలువైన బహుమతులు బహుకరించారు.

    విఫలమవుతున్నాడు

    కేఎల్ రాహుల్ ఇటీవల కాలంలో తన పూర్వపు లయను కోల్పోయాడు. ఒకప్పటిలాగా ఆడటం లేదు. అందువల్లే అతడికి జట్టులో అవకాశాలు లభించడం లేదు. మిగతా ఆటగాళ్లు సత్తా చాటుతున్న నేపథ్యంలో.. కేఎల్ రాహుల్ తుది జట్టులో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. నిర్లక్ష్యమైన ఆటతీరుతో అతడు పరువు పోగొట్టుకుంటున్నాడు. ఒకప్పటిలాగా ఫామ్ సాధించాలని.. టీమిండియా సాధించే విజయాలలో ముఖ్య పాత్ర పోషించాలని అభిమానులు అతడిని సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు. అయితే ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న రాహుల్.. ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. అతడిని బోర్డర్ గవాస్కర్ టోర్నీ కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. అతడేమో ఇలాంటి దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. ఎందుకు ఎంపిక చేశారని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా బీసీసీఐ పెద్దలను ప్రశ్నిస్తున్నారు. నాణ్యమైన ఆటగాళ్లను ఎంపిక చేయాలని కోరుతున్నారు.