KL Rahul: అందు గురించే లక్నో నుంచి బయటికి వచ్చాను.. కేఎల్ రాహుల్ సంచలనం

ఐపీఎల్ లో లక్నో జట్టు కెప్టెన్ గా కేఎల్ రాహుల్ మంచి మార్కులే కొట్టేశాడు. ఇటీవల సీజన్ ను పక్కన పెడితే అంతకుముందు సీజన్లలో ఆ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ఆ జట్టు నుంచి ఇటీవల అతడు బయటికి వచ్చాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : November 12, 2024 11:53 am

KL Rahul(2)

Follow us on

KL Rahul: ఇటీవల రిటైన్ జాబితాలో లక్నో జట్టు రాహుల్ పేరు ప్రస్తావించలేదు. దీంతో అతడు వేలంలో పాల్గొంటారని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ స్వస్థలం కర్ణాటక కావడంతో.. త్వరలో జరిగే మెగా వేలంలో రాహుల్ ను బెంగళూరు జట్టు యాజమాన్యం కొనుగోలు చేస్తుందని వార్తలు వస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో పాటు చెన్నై జట్టు కూడా అతడిని కొనుగోలు చేయడానికి ముందు వరుసలో ఉందని తెలుస్తోంది. స్టార్ ఆటగాడిగా రాహుల్ కు మంచి పేరు ఉంది. ఐపీఎల్ లో అతనికి మెరుగైన రికార్డు ఉంది. అయితే ఇటీవల సీజన్లో హైదరాబాద్ జట్టుతో లక్నో జట్టు పోటీపడిన సమయంలో.. లక్నో జట్టు అధిపతి సంజీవ్ గోయంకా కు రాహుల్ కు గొడవ జరిగింది. దీంతో అప్పుడే రాహుల్ బయటికి వస్తాడని ప్రచారం జరిగింది. అయితే దానిపై అటు లక్నో యాజమాన్యం, ఇటు రాహుల్ స్పందించలేదు. అయితే ఇన్నాళ్లకు స్పష్టత వచ్చింది. ఇటీవలి రిటైన్ జాబితాలో రాహుల్ పేరును లక్నో యాజమాన్యం ప్రస్తావించలేదు. దీంతో అతడు బయటికి రావడం ఖాయంగా మారింది. సంజీవ్ తనపై బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేయడంతో రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని తెలుస్తోంది. అందువల్లే ఆ జట్టుకు దూరంగా వచ్చాడని సమాచారం. అయితే తాను లక్నో జట్టు నుంచి బయటికి రావడానికి గల కారణాలను రాహుల్ వివరించాడు. ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ విషయాలను వెల్లడించాడు.

కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నాను..

లక్నో జట్టు నుంచి బయటికి రావడానికి గల కారణాలను రాహుల్ వివరించాడు. ” నేను క్రికెట్ ఆడేందుకు స్వేచ్ఛ అవసరం. అందువల్లే లక్నో జట్నుంచి బయటికి వచ్చాను. ఏ ఆటగాడికైనా ఆడే సమయంలో జట్టు వాతావరణం తేలికగా ఉండాలి. కాస్తలో కాస్త స్వేచ్ఛ లభించాలి. అప్పుడే మన ప్రదర్శనను నూటికి నూరు శాతం ఆవిష్కరించడానికి ఆస్కారం ఉంటుందని” రాహుల్ వ్యాఖ్యానించాడు. అయితే రాహుల్ కొంతకాలంగా భారత టి20 జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా – ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు జరిగాయి. అందులోనూ రాహుల్ విఫలమయ్యాడు. అయితే టి20 జట్టుకు దూరంగా ఉంటున్న సమయంలో రాహుల్ తనదైన వ్యాఖ్యలు చేశాడు. “. ఆటగాడిగా నా సామర్థ్యం సెలక్టర్లకు తెలుసు. అలాంటప్పుడు నేను జోక్యం చేసుకోలేను. ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేను. జట్టులోకి తిరిగి రావడానికి ఏం చేయాలో నాకు తెలుసు. దానిని నెరవేర్చుకోవడానికి ఐపీఎల్ వేదికగా మారుతుందని నేను అనుకుంటున్నాను. కచ్చితంగా ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాను. జట్టులో స్థానం సంపాదిస్తాను. నాకు క్రికెట్ ఆడటం ఇష్టం. దానిని ఆస్వాదించడం ఇష్టం. టి20 లో జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నానని” రాహుల్ వ్యాఖ్యానించాడు. కాగా, రాహుల్ రెండు సంవత్సరాల క్రితం బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని వివాహం చేసుకున్నాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. ఇదే విషయాన్ని రాహుల్ సామాజిక మాధ్యమాల వేదికగా తన అభిమానులతో పంచుకున్నాడు. రాహుల్ త్వరలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. ఇప్పటికే అతడు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. రెండు విడతలులంగా ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు ఆటగాళ్లను అతడు కలిశాడు. మంగళవారం ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు.