https://oktelugu.com/

Zodiac Signs: కార్తీక మాసం.. ఈ 3 రాశుల వారికి రాజయోగం.. ఏ పని మొదలుపెట్టినా.. విజయమే..

పరమ పవిత్రమైన మాసంలో కార్తీకం ఒకటి. అశ్వయిజ మాసం తరువాత వచ్చేది కార్తీక మాసం. సాధారణంగా శివ పూజలు ఉంటాయి.. లేదా విష్ణు పూజలు ఉంటాయి. కానీ కార్తీక మాసంలో శివకేశవులు అనే భేదం లేకుండా అందరూ పూజలు నిర్వహిస్తారు

Written By:
  • Srinivas
  • , Updated On : November 12, 2024 / 11:50 AM IST

    Zodiac

    Follow us on

    Zodiac Signs: పరమ పవిత్రమైన మాసంలో కార్తీకం ఒకటి. అశ్వయిజ మాసం తరువాత వచ్చేది కార్తీక మాసం. సాధారణంగా శివ పూజలు ఉంటాయి.. లేదా విష్ణు పూజలు ఉంటాయి. కానీ కార్తీక మాసంలో శివకేశవులు అనే భేదం లేకుండా అందరూ పూజలు నిర్వహిస్తారు.ఈ మాసంలో పవిత్రంగా ఉండడం వల్ల అంతా మంచే జరుగుతుందని చాలా మంది భావన. నవంబర్ 2 నుంచి కార్తీక మాసం ప్రారంభం అయింది. డిసెంబర్ 1 అమావాస్య వరకు ఈ మాసం కొనసాగుతుంది. అయితే కార్తీక మాసం సందర్భంగా కొన్ని రాశుల వారికి కుభేర రాజయోగం కలగనుంది. 64 సంవత్సరాల తరువాత ఈ కార్తీకమాసంలో కొన్ని రాశుల వారికి ఆకస్మిక అదృష్టం వరించనుంది. మరి ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం..

    కార్తీక మాసం సందర్భంగా మేష రాశి వారికి అనుకోని అదృష్టం వరించనుంది. ఈ రాశి వారికి ఇప్పటికే అన్నీ కలిసి వస్తున్నాయి. వీరు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వీరి నిర్ణయం పట్ల ఇతరులు ప్రశంసిస్తారు. ఎన్నో ఏళ్లుగా నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న వ్యాపారులకు ఇక నుంచి లాభాల పంట పండనుంది. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చి రాని బాకీలు ఉంటే ఈ మాసంలో వారు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతూ ఉల్లాసంగా ఉంటారు.

    ధనస్సు రాశి వారికి కార్తీక మాసం కలిసి రానుంది. వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు రాజకీయ నాయకులైతే వారు అనుకున్న స్థానాన్ని పొందగలుగుతారు. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కొత్త పెట్టుబడులు పెడుతారు భాగస్వాములతో కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఏ పని చేసినా వారికి ఇతరుల తోడు కచ్చితంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతులో కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. అయితే కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.

    శివకేశవుల ఆరాధ్యకు మంచి సమయమైన కార్తీక మాసం మీన రాశి వారికి బాగా కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఐశ్వర్య వంతులుగా మారుతారు. వీరి నిర్ణయాల పట్ల జీవిత భాగస్వామి సంతోషిస్తుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విహార యాత్రలకు వెళ్లి ఉల్లాసంగా ఉంటారు. ఇన్నాళ్లు ఉన్న ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. పాత స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు.

    ఈ మూడు రాశుల వారు మాత్రమే కాకుండా మిగతా రాశుల వారు శివకేశవులను ఆరాధించడం వల్ల అన్నీ కలిసి వస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో నదీ స్నానం చేయడం వల్ల ఇన్నాల్లు ఉన్న దోషాలు తొలగిపోతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. కుటుంబ విషయంలో నిర్ణయాలు తీసుకునే సమయంలో జీవిత భాగస్వామికి ప్రాధాన్యత ఇవ్వాలి.