KKR : ఐపీఎల్ 17వ సీజన్లో కోల్ కతా జట్టు దూకుడుగా ఆడుతోంది. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో అద్భుతమైన విజయాలు సాధించింది. ఎంతటి గొప్ప టీం అయినా, ఎంతటి కఠినమైన మైదానమైనా కోల్ కతా ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బౌలర్లు కసిగా వికెట్లు తీస్తుంటే.. బ్యాటర్లు బాదుడే లక్ష్యంగా పరుగులు తీస్తున్నారు. రెండు వరుస విజయాలు సాధించి తమ జట్టును పాయింట్లు పట్టికలో చెన్నై తర్వాత స్థానంలో నిలిపారు.
సొంత మైదానంలో ఐపీఎల్ 17వ సీజన్ లో ప్రారంభ మ్యాచ్ ఆడిన కోల్ కతా జట్టు హైదరాబాదును మట్టికరిపించింది. ఆ మ్యాచ్ లో 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి కోల్ కతా 208 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ ను 204 పరుగుల వద్ద నిలిపివేసింది.
ఈ మ్యాచ్లో కోల్ కతా బౌలర్ రస్సెల్ ఆల్ రౌండర్ ప్రదర్శన చూపించాడు. బ్యాట్ తో దూకుడుగా ఆడిన అతడు.. బంతితోనూ మెరిశాడు. 25 బంతుల్లో 64 పరుగులు చేశాడు. బౌలింగ్లో రెండు వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రానా మూడు, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్లో గొప్పగా బౌలింగ్ వేస్తాడు అనుకున్న మిచెల్ స్టార్క్ ఉసూరనిపించాడు. నాలుగోవలలో 53 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. ఇక రెండో మ్యాచ్ లోనూ అతడు తన వైఫల్యాన్ని కొనసాగించాడు.. శుక్రవారం బెంగళూరు వేదికగా బెంగళూరు తో జరిగిన మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు 182 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్, హర్షిత్ రానా, రస్సేల్ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు. ఇక్కడ ఈ మ్యాచ్ లోనూ స్టార్క్ విఫలమయ్యాడు. నాలుగు ఓవర్లలో 47 పరుగులు ఇచ్చుకున్నాడు. మొత్తం గారు రెండు మ్యాచ్ లలో ఒక్క వికెట్ పడగొట్టకుండా 100 పరుగులు ఇచ్చాడు.
దీంతో ఇతడి పై విమర్శలు మొదలయ్యాయి.. ఇతడి పై ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ కు ఏకంగా ఐలాండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. “రెండు మ్యాచ్ లలో స్టార్క్ ఇచ్చుకున్న రన్స్ కంటే.. మా దేశంలో దొరికే బీర్ ధర చాలా ఎక్కువ అంటూ” తిరుగులేని పంచ్ విసిరింది. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.