Sunny: ఆ నలుగురు బిగ్ బాస్ విన్నర్స్ ఏం సాధించారు?.. సన్నీ పరిస్థితి ఏమవుతుంది?

Sunny: వంద రోజులు బయట ప్రపంచానికి దూరంగా ఉండడం మానసికంగా పెద్ద సవాల్. బిగ్ బిగ్ హౌస్ లో సరైన నిద్ర, తిండి ఉండదు. గేమ్స్, టాస్క్ కారణంగా పక్కనే ఉన్న ఆ కొద్ది మంది వ్యక్తులతో గొడవ పడాల్సిన పరిస్థితి. ఇష్టం లేకపోయినా కొందరిని విబేధించాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్లే హౌస్ లో ఉండగలరు. అయితే టెంప్ట్ చేసే రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ కంటెస్టెంట్స్ కష్టనష్టాలు భరించేలా ప్రేరేపిస్తుంది. బిగ్ బాస్ టైటిల్ అందుకోవడం […]

Written By: Shiva, Updated On : December 20, 2021 12:27 pm
Follow us on

Sunny: వంద రోజులు బయట ప్రపంచానికి దూరంగా ఉండడం మానసికంగా పెద్ద సవాల్. బిగ్ బిగ్ హౌస్ లో సరైన నిద్ర, తిండి ఉండదు. గేమ్స్, టాస్క్ కారణంగా పక్కనే ఉన్న ఆ కొద్ది మంది వ్యక్తులతో గొడవ పడాల్సిన పరిస్థితి. ఇష్టం లేకపోయినా కొందరిని విబేధించాలి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉన్నవాళ్లే హౌస్ లో ఉండగలరు. అయితే టెంప్ట్ చేసే రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ కంటెస్టెంట్స్ కష్టనష్టాలు భరించేలా ప్రేరేపిస్తుంది.

Bigg Boss Winner Sunny

బిగ్ బాస్ టైటిల్ అందుకోవడం చిన్న విషయమైతే కాదు. మరి ఇంత కష్టపడి సాధించిన బిగ్ బాస్ టైటిల్ వలన విన్నర్ కి దక్కేది ఏమిటి? బిగ్ బాస్ టైటిల్ తో అతని కెరీర్ పూర్తిగా మారిపోతుందా?. దానికి గ్యారెంటీ లేదు. బిగ్ బాస్ విన్నర్ గా రూ. 50 లక్షల ప్రైజ్ మనీ, ట్రోపి, 15 వారాల రెమ్యూనరేషన్ దక్కుతాయి. డబ్బులు రూపంలో బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునేవి ఇవి. అయితే బిగ్ బాస్ విన్నర్ అన్న ఫేమ్, ఇమేజ్ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడడం లేదని, హిస్టరీ పరిశీలిస్తే అర్థమవుతుంది.

ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో బిగ్ బాస్ షోకి అంకురార్పణ జరిగింది. టాప్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్స్ గా పాల్గొన్న బిగ్ బాస్ సీజన్ 1 సూపర్ సక్సెస్. హోస్ట్ గా ఎన్టీఆర్ స్కిల్స్ కి బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సీజన్ విన్నర్ గా యాక్టర్ శివబాలాజీ నిలిచాడు.

ఇక సెకండ్ సీజన్ నుండి ఎన్టీఆర్ తప్పుకోవడంతో నాని రంగంలోకి దిగారు. హోస్ట్ గా నాని యావరేజ్ మార్కులు అందుకున్నారు. ఈ సీజన్లో కౌశల్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక మూడవ సీజన్ నుండి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు తీసుకున్నారు. నాగార్జున సారథ్యంలో సాగిన బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్, సీజన్ 4 విన్నర్ గా అభిజీత్ నిలిచారు.

ఇక నిన్న ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలేలో టైటిల్ విన్నర్ గా సన్నీ అవతరించాడు. షన్నుతో పోటీ పడిన సన్నీ టైటిల్ దక్కించుకున్నారు. శివబాలాజీ నుండి అభిజీత్ వరకు బిగ్ బాస్ విన్నర్స్ కెరీర్ పరిశీలిస్తే ఒక్కరు కూడా సక్సెస్ కాలేదు. కొందరి కెరీర్స్ అయితే బిగ్ బాస్ షో తర్వాత మరింత దిగజారాయి. శివబాలాజీ, కౌశల్ కి కనీస అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు అడపాదడపా చిత్రాలలో కనిపించే వీరు పూర్తిగా కనుమరుగయ్యారు.

Also Read: BiggBoss Sunny: బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు.? అసలు కారణాలేంటి?

ఇక రాహుల్ సిప్లిగంజ్ సింగర్ గా తన ప్రొఫెషన్ లో బిజీగా ఉన్నారు. అలా అని బిగ్ బాస్ విన్నర్ గా అతనికి ప్రత్యేకంగా దక్కిన అడ్వాంటేజ్ ఏమీ లేదు. శివ బాలాజీ, కౌశల్ లతో పోల్చుకుంటే రాహుల్ కొంచెం లైమ్ లైట్ లో ఉన్నారు. ఇక అభిజీత్ వీరందరి కంటే దారుణం. బిగ్ బాస్ ముగిసిన రెండు మూడు నెలల్లోనే జనాలు అతన్ని మర్చిపోయారు. బిగ్ బాస్ విన్నర్ గా అతడికి ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. సోషల్ మీడియాకు కూడా దూరంగా వుంటూ.. తన వ్యాపకాలతో గడిపేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో కొత్తగా అవతరించిన సన్నీ పరిస్థితి కూడా ఇంతేనా?.. లేక నటుడిగా సక్సెస్ కొట్టి ట్రెండ్ సెట్ చేస్తాడా? అనే సందేహాలు మొదలైపోయాయి. అయితే అప్పుడే ఒక నిర్ణయానికి రాకూడదు కాబట్టి. సన్నీ జర్నీని కొన్ని నెలలు పరిశీలిస్తే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇమేజ్ ఎంత వరకు ఉపయోగపడిందో అర్థమవుతుంది.

Also Read: Shanmukh: ‘అరే ఎంట్రా ఇదీ’.. షణ్నును కావాలనే ఓడించారా?

Tags