Kavya Maran Support Team: ప్లే ఆఫ్ లో గెలుస్తుందని.. కచ్చితంగా గుజరాత్ జట్టును ఓడించి.. ఫైనల్ వెళ్తుందని.. ఫైనల్ లో బెంగళూరును మట్టి కరిపించి ట్రోఫీ అందుకుంటుందని.. హైదరాబాద్ జట్టు మీద కొద్ది రోజులుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చాలామంది కూడా హైదరాబాద్ జట్టు విజేత అవుతుందని ఒక స్పష్టమైన అంచనాకు వచ్చారు.. క్వాలిఫైయర్ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. రాజస్థాన్ జట్టుకు ఈ సీజన్లో ముచ్చటగా మూడవ ఓటమి హైదరాబాద్ జట్టు నుంచి ఎదురవుతుందని క్రికెట్ విశ్లేషకులు స్పష్టం చేశారు. కానీ వారి అంచనాలు.. విశ్లేషణలు పూర్తిగా తప్పయ్యాయి. ఈ సీజన్లో వరుసగా హైదరాబాద్ చేతిలో రెండు ఓటములు ఎదుర్కొన్న రాజస్థాన్.. కీలకమైన దశలో గెలిచింది. గెలవడం మాత్రమే కాదు.. ఫైనల్ వెళ్లడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.
కీలకమైన మ్యాచులు హైదరాబాద్ బౌలర్లు.. బ్యాటర్లు చేతులెత్తేశారు. అభిషేక్ శర్మ నుంచి మొదలుపెడితే హెడ్ వరకు అందరూ విఫలం కావడంతో హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య విపరీతంగా బాధపడిపోయింది. బౌలర్లు కూడా దారుణంగా పరుగులు ఇవ్వడంతో ఒక రకమైన అసహనంతో కనిపించింది. మైదానంలో ఒత్తిడి తట్టుకోలేక కొన్ని సందర్భాలలో తన రెండు చేతులతో కళ్ళు మూసుకుంది. మ్యాచ్ జరుగుతున్నంత సేపు బాధ.. కోపం.. నిస్సహాయతను ప్రదర్శించింది.
ఓటమి తప్పదని భావించిన తర్వాత.. తనకు తానే సర్ది చెప్పుకుంది. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసింది. మైదానంలోకి వెళ్లి చిచ్చరపిడుగు వైభవ్ సూర్య వంశీకి షేక్ హ్యాండ్ ఇచ్చింది. అద్భుతంగా ఆడావంటూ అతడి భుజాన్ని తట్టి అభినందించింది. ఆ తర్వాత తన జట్టు దగ్గరికి వెళ్లి మాట్లాడింది. గెలుపు ఓటమి అన్నది సహజమని.. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించారని ఆటగాళ్లలో ధైర్య వచనాలు నింపింది. దీనికి సంబంధించిన వీడియోలు.. ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. కావ్య ను చూసి మిగతా జట్ల యాజమాన్యాలు నేర్చుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.
You gotta feel for Kavya Maran.
– SRH lost the final against KKR in 2024
– Finished at no.6 in 2025
– Lost eliminator against RR in 2026She created one of the most destructive batting Line-up.But still SRH batters are disappointing her in crucial matches. pic.twitter.com/nRAAEol2I6
— Drona (@drona_17) May 27, 2026
