Kavya Maran Marriage: కొన్నిసార్లు పుకార్లుగా.. ఇంకొన్నిసార్లు ఆరోపణలుగా.. మరికొన్నిసార్లు మసాలా వంటకంగా సాగిపోతోంది కావ్య మారన్ పెళ్లి వ్యవహారం. వేలకోట్ల ఆస్తికి ఒక్కతే వారసురాలు. పైగా ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. అదే సమయంలో మ్యూజిక్ ని కూడా ఆస్వాదిస్తూ ఉంటుంది. అందువల్లే సన్ మ్యూజిక్.. సన్ రైజర్స్ జట్లకు యజమానిగా వ్యవహరిస్తోంది. కొంటె చూపులతో.. అమాయకపు హావభావాలతో ఆకట్టుకుంటున్నది. అందువల్లే ఆమెను చాలామంది ఇష్టపడుతుంటారు.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది..
కావ్య ఐపీఎల్ సమయంలో చేసే సందడి మాములుగా ఉండదు. జట్టు గెలిచినప్పుడు ఎగిరి గంతులు వేస్తుంది. ఓడిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎక్కడ కూడా తన హావభావాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయదు. ఒకరకంగా చెప్పాలంటే బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా క్యారెక్టర్ తనది. మనసులో ఏది ఉంటే అదే బయటపడుతుంది. లోపల నుంచి ఎటువంటి భావాన్ని ప్రదర్శించాలనుకుంటే.. దానినే బయటపెడుతుంది. అందువల్లే హైదరాబాద్ అభిమానులకి కాదు.. సన్ గ్రూపులో పనిచేసే ప్రతి ఉద్యోగికి కావ్య అంటే విపరీతమైన ఇష్టం.
కావ్య పెళ్లికి సంబంధించి.. అనేక వార్తలు గతంలో ప్రచారంలో ఉన్నాయి. అయితే వీటిని కావ్య ఖండించలేదు. అలాగని సమర్థించ లేదు. జస్ట్ విని ఊరుకుంది. చూసి నవ్వుకుంది. ఇప్పుడు కావ్య పెళ్లికి సంబంధించి మరో అప్డేట్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.. కావ్య త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని.. ఆమె సంగీత దర్శకుడు అనిరుద్ తో పీకల లోతు ప్రేమలో ఉందని.. తమిళ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే అనిరుద్.. కావ్య ఒకటి కాబోతున్నారని తమిళ మీడియాలో తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి.
గతంలో కావ్య.. అనిరుద్ విదేశాలలో కనిపించారు. జంటగా తిరిగారు. అప్పట్లో కావ్యతో పెళ్లికి సంబంధించిన విమర్శలు వచ్చినప్పుడు అనిరుద్ స్పందించాడు. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని.. మా మధ్య ఎటువంటి సంబంధం లేదని అతడు క్లారిటీ ఇచ్చాడు. అయినప్పటికీ ఈ ప్రచారం ఆగడం లేదు. వారిద్దరికీ పెళ్లి జరుగుతుందని.. త్వరలోనే ఒకటి కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాల్సి ఉంది. అన్నట్టు ఐపిఎల్ ముందు కావ్య పెళ్లికి సంబంధించిన వార్త మీడియాలో వినిపిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ అభిమానుల గుండెలు ఆగిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.