Kavya Maran: గత సీజన్ ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఫలితంగా రన్న రప్ గా నిలిచింది. ఈ సీజన్లో మాత్రం హైదరాబాద్ జట్టు ఆ స్థాయిలో ఆట తీరు చూపించలేకపోతోంది. వాస్తవానికి తొలి మ్యాచ్లో ఉప్పల్ మైదానం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై 286 పరుగులు చేయడం.. ఆ తర్వాత భారీ విజయాన్ని అందుకోవడంతో హైదరాబాద్ జట్టు పై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇంకేముంది ఈసారి 300 పరుగులు చేస్తుంది. ఐపీఎల్ ట్రోఫీని కూడా దక్కించుకుంటుందని అందరూ అంచనా వేశారు. కానీ వాస్తవంలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కో మ్యాచ్ ఓడిపోతూ హైదరాబాద్ జట్టు పరువు తీసుకుంటున్నది. వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడిపోయి హైదరాబాద్ జట్టు పరువు తీసుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. నెట్ రన్ రేట్ కూడా హైదరాబాద్ జట్టు ది దారుణంగా ఉంది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న హైదరాబాద్ జట్టు తేలిపోతుంది. హెడ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ భారీగా పరుగులు చేయలేకపోతోంది. వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడిపోయి.. ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరికి సొంత మైదానంలో జరిగిన మ్యాచ్లలోనూ ఓటమిపాలవుతూ హైదరాబాద్ జట్టు.. అభిమానుల చేతిలో విమర్శలకు గురవుతోంది. బ్యాటింగ్ లో సత్తా చూపించలేకపోవడం.. బౌలింగ్లో చేతులెత్తేయడం.. ఫీల్డింగ్ లో తడబాటుకు గురి కావడంతో.. హైదరాబాద్ జట్టు ఏ దశలోనూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వలేకపోతోంది. జట్టు దుస్థితి చూసి..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్(Kavya maaran) ఆవేదన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు విఫలం కావడం ఆమెను తీవ్రంగా బాధించింది.
Also Read: 300 లోడింగ్.. సన్ రైజర్స్ కు మొదటికే మోసం!
200 అయినా కొట్టండి రా
హైదరాబాద్ జట్టు తొలి మ్యాచ్లో 286 పరుగులు చేసింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మినహా.. మిగతా అన్ని జట్లపై 200 లోపే హైదరాబాద్ జట్టు స్కోర్ చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని కూడా కాపాడుకోవడంలో హైదరాబాద్ జట్టు విఫలమైంది.. తద్వారా నాలుగు ఓటములను ఎదుర్కొంది. జట్టు దుస్థితి చూసి హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఆవేదన చెందుతోంది. ఆటగాళ్లు సరిగ్గా పరుగులు చేయకపోవడం ఆమెను తీవ్రంగా బాధిస్తోంది .. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు విఫలం కావడంతో… గ్యాలరీలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న కావ్య విషాదంలో మునిగిపోయింది. ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో ఆమె ఒకసారిగా భావోద్వేగానికి గురైంది. ఆశలు పెట్టుకున్న హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి ఆటగాళ్లు విఫలం కావడం ఆమెను తీవ్రంగా బాధించింది. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. వాటిని చూసిన నెటిజన్లు కావ్య మారన్ ను ఓదర్చుతున్నారు.. కావ్య పాపా మీ మీద అంత ఖర్చు పెట్టింది. కనీసం 200 పరుగులైనా చేయండి రా అంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లను ఉద్దేశించి నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram