Karun Nair: ఈ మ్యాచ్ లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కరణ్ నాయర్ గురించి. ఏదోపూనకం వచ్చినట్టు కొట్టాడు. బౌలర్ ఎవరు అనేది చూడకుండా వీర విహారం చేశాడు.. బౌండరీ మీటర్ బద్దలయ్యేలాగా బంతిని ఉతికి ఆరేశాడు. చివర్లో ముంబై గెలిచింది. ఈ ఐపీఎల్లో ఢిల్లీ ఇప్పటివరకు కోల్పోయిన మ్యాచ్ ఇదొక్కటే. ఆయనప్పటికీ పాయింట్ల పట్టికలో టాప్ స్థానంలోనే కొనసాగుతోంది. ఈ సీజన్లో అంచనాలు బాగా ఉన్న జట్లు అంతగా ఆడటం లేదు. చెన్నై, ముంబై, హైదరాబాద్ (నాలుగు ఓటముల తర్వాత మొన్నే పంజాబ్ పై గెలిచింది) నేలబారు ప్రదర్శన చేస్తుండగా.. పంజాబ్, లక్నో, ఢిల్లీ, గుజరాత్ మెరుగ్గా ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ స్థానాలలో కొనసాగుతున్నాయి. మరి వచ్చే రోజుల్లో ఈ జట్ల ఆట తీరు ఎలా ఉంటుందో చూడాలి. ఇక బెంగళూరు అయితే పర్వాలేదన్నట్టుగానే ఆడుతోంది. వచ్చే రోజుల్లో ఈ జట్టు ఆట కూడా ఎలా ఉంటుందనేది ఆసక్తి కరం.. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు కరణ్ నాయర్ ఒక్కసారిగా ట్రెండింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. ఇటీవల జరిగిన మెగా వేలంలో కరణ్ నాయర్ అమ్ముడు పోలేదు. ఏ జట్టు మేనేజ్మెంట్ కూడా కొనుగోలు చేయలేదు. కానీ అతడి బెస్ట్ ఫ్రెండ్ కె.ఎల్ రాహుల్.. మాత్రం సపోర్ట్ చేశాడు. అతడిని 50 లక్షలకు ఢిల్లీ జట్టు కొనుగోలు చేసేలా తెర వెనుక చక్రం తిప్పాడు. స్నేహితుడు తనపై ఉంచిన నమ్మకాన్ని కరణ్ నాయర్ నిలబెట్టుకున్నాడు..
Also Read: మూసగా వేస్తే కులదీప్ ఎందుకు అవుతాడు.. ఈ ఐపీఎల్ లో కొత్తగా కనిపిస్తున్నాడు..
దేశవాళీ టోర్నీలలో
నిజానికి దేశవాళీ టోర్నీలలో కరణ్ నాయర్ మంచి స్కోరర్. కానీ ఎందుకనో అతడికి టీమిండియాలో చోటు దక్కలేదు.. ఏవేవో రాజకీయాల వల్ల అతడు తట్టుకోలేకపోయాడు. విసిగిపోయాడు.. 2022లో ఒక ట్వీట్ కూడా చేశాడు. ఆదివారం ముంబైలో జరిగిన మ్యాచ్లో ప్రపంచంలోనే అత్యంత నేటి బౌలర్ అయిన బుమ్రా బౌలింగ్లో కరణ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బుమ్రా వేసిన ఒక ఓవర్లో ఏకంగా 18 పరుగులు సాధించాడు. 2024-25 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో అదరగొట్టాడు. ఇందులో ఆరు ఇన్నింగ్స్ లలో 255 పరుగులు చేశాడు.. ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇతడి హైయెస్ట్ స్కోర్ 77, యావరేజ్ 42.5 గా ఉంది. కీలక దశలో కరణ్ నాయర్ అవుట్ కావడం.. మిగతా ఆటగాళ్లు విఫలం కావడంతో ముంబై జట్టు చివరికి విజయం సాధించింది. చివరి ఓవర్ లో ముగ్గురు ఆటగాళ్లు రనౌట్లు కావడం ముంబై జట్టు విజయానికి కారణమైంది. మొత్తానికి ఈ సీజన్లో ఢిల్లీ జట్టు ఎదుర్కొన్న తొలి ఓటమి ఇదే కావడం విశేషం.