DC MI IPL 2025: ఈ కాలంలో ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండీస్, అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ మాదిరిగా బౌలింగ్ వేస్తూ.. అదరగొడుతున్నాడు ఢిల్లీ ఆటగాడు కులదీప్ యాదవ్. ఆదివారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన కూడా కులదీప్ యాదవ్ 23 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. సాధారణంగా ఐపీఎల్ లో ఇలాంటి గణాంకాలు ఎప్పుడో ఒకసారి మాత్రమే సాధ్యమవుతాయి. కానీ కులదీప్ యాదవ్ ప్రస్తుత ఐపిఎల్ లో ఇలానే పొదుపుగా బౌలింగ్ వేస్తున్నాడు. అదే సమయంలో వికెట్లు కూడా పడగొడుతున్నాడు. ముంబై తో జరిగిన మ్యాచ్లో కూడా అదే మ్యాజిక్ ప్రదర్శించాడు. ముఖ్యంగా ముంబై ఓపెనర్ రికెల్టన్ (41) వికెట్ పడగొట్టిన తీరు ఈ మ్యాచ్ మొత్తానికే హైలెట్. రికెల్టన్ కు గూగ్లీ బంతి సంధించి వికెట్ పడగొట్టాడు కులదీప్ యాదవ్. దీంతో బిత్తరపోవడం రికెల్టన్ వంతు అయింది. అంతేకాదు మరో ప్రమాదకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (40) ను కూడా కులదీప్ యాదవ్ బోల్తా కొట్టించాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో రెండు వికెట్లు సాధించాడు. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో కులదీప్ యాదవ్ తనదైన మ్యాజిక్ ప్రదర్శిస్తున్నాడు. స్టాక్ విధానంలో 60 బంతులు వేసి 62 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు. గూగ్లి విధానంలో 58 బంతులు వేసి 49 పరుగులు ఇచ్చాడు. ఇందులో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇక క్విక్కర్ విధానంలో రెండు బంతులు వేశాడు.. కేవలం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు.
Also Read: నాటు కొట్టుడు స్టైల్.. ఇదీ తెలుగోడు తిలక్ వర్మ అంటే.. అర్థమైందా హార్దిక్కూ!
120 బంతుల్లో 112 పరుగులు..
మొత్తంగా ఈ సీజన్లో 120 బంతులు వేసి.. 112 పరుగులు ఇచ్చాడు. స్థూలంగా చెప్పాలంటే అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. వికెట్స్ కూడా పడగొడుతున్నాడు. అందువల్లే కులదీప్ యాదవ్ బౌలింగ్లో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. ఢిల్లీకి వికెట్ అవసరమైన ప్రతి సందర్భంలో కులదీప్ యాదవ్ ను రంగలోకి దిగుతున్నాడు అంటే.. అక్షర్ పటేల్ కు కులదీప్ యాదవ్ పై ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా, షమీ, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా లాంటి బౌలర్లు తేలిపోతున్న ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో.. కులదీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. వికెట్లు మాత్రమే కాదు.. పరుగులు కూడా అత్యంత తక్కువగా ఇస్తున్నాడు. అందువల్లే అతనిపై ఢిల్లీ యాజమాన్యం.. ఢిల్లీ జట్టు విపరీతమైన నమ్మకాన్ని పెంచుకుంది… గతంలో కులదీప్ యాదవ్ ధారాళంగా పరుగులు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పిచ్ సహకరించకపోయినప్పటికీ బంతి నుంచి స్పిన్ రాబడుతున్నాడు. అంతేకాదు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. అందువల్లే ఈ ఐపిఎల్ సీజన్లో మోస్ట్ డిమాండ్ ఉన్న బౌలర్ గా కులదీప్ యాదవ్ రూపాంతరం చెందాడు.
KULDEEP YADAV RIPPER. ⚡ pic.twitter.com/adCCFpnjhz
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 13, 2025