IND vs BAN Test : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ వేదికగా రెండవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి 2-0 తేడాతో సిరీస్ దక్కించుకోవాలని భారత్ భావిస్తున్నది. ఒకవేళ అదే జరిగితే 18వ సిరీస్ విజయం భారత్ ఖాతాలో నమోదవుతుంది. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి భారత జట్టుపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. భారత బౌలర్లు అద్భుతమైన ప్రతిభ చూపించడంతో బంగ్లా జట్టు చేతులెత్తేసింది. పాకిస్తాన్ జట్టును వైట్ వాష్ చేసిన బంగ్లా.. భారత్ గడ్డపై మాత్రం తలదించింది. అయితే చెన్నై లో జరిగిన పరాభవానికి గట్టిగా బదులు ఇవ్వాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఇక్కడ విజయం సాధించి సిరీస్ సమన్ చేయాలని భావిస్తోంది.
చెన్నై టెస్టులో అశ్విన్, పంత్, గిల్, జడేజా ఆకట్టుకున్నారు. జైస్వాల్ సత్తా చాటాడు. కానీ విరాట్ కోహ్లీ, రోహిత్ విఫలమయ్యారు. వారిద్దరూ సరిగా ఆడలేక పోవడం జట్టు యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతోంది. సుదీర్ఘ సీజన్ ముందు ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు ఫామ్ లోకి రావలసి ఉంది. కేఎల్ రాహుల్ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ మైదానం స్పిన్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. అయితే భారత జట్టు దీనిని ముందుగానే గుర్తించి చెన్నై మాదిరిగా కాకుండా కాన్పూర్లో ఇద్దరు పేస్ బౌలర్లతో బరిలోకి దిగింది. ఆకాశ్ దీప్ కు విశ్రాంతి ఇచ్చింది. కులదీప్, అక్షర్ లో ఒకరికి అవకాశం ఇచ్చింది. మరో 8 టెస్ట్ మ్యాచ్ లు ఆడాల్సి ఉండడంతో పేసు గుర్రం బుమ్రా కు రెస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది . 2021లో భారత్ ఇక్కడ చివరి టెస్ట్ ఆడింది. అప్పుడు అశ్విన్, జడేజా, అక్షర్ కు అవకాశం ఇచ్చింది.
షకీబ్ ఉంటాడా?
తొలి టెస్టులో బంగ్లా బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడింది. అయితే ఈ టెస్టులో కూడా ఆ జట్టుకు తడబాటు తప్పలేదు. బంగ్లా స్టార్ ఆటగాడు షకీబ్ అల్ హసన్ వేలిగాయానికి గురైయ్యాడు కోచ్ మాత్రం అతడు అందుబాటులోకి ఉంటాడని చెబుతున్నాడు. బ్యాటింగ్ లో షాంటో పైనే భారం ఉంది. మోమినుల్, ముష్ఫికర్ విఫలం కావడం ఆ జట్టును ఇబ్బంది పెడుతోంది.. ఈ మ్యాచ్లో బంగ్లాదేశ్ టైజుల్ ఇస్లాం ను మూడో స్పిన్నర్ గా బరిలోకి దింపాలని భావిస్తోంది. బంగ్లా జట్టు బలం స్పిన్నర్లే కాబట్టి.. రెండో టెస్టులోనూ వారినే రంగంలోకి దింపాలని యోచిస్తోంది.
జట్ల అంచనా ఇలా
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, జైస్వాల్, విరాట్, పంత్, జడేజా, అశ్విన్, కులదీప్ యాదవ్, సిరాజ్, ఆకాష్ దీప్/ బుమ్రా.
బంగ్లాదేశ్: షాంటో(కెప్టెన్), షాద్ మాన్, జకీర్ హసన్, మోమినుల్ హక్, తస్కిన్/ నహీద్, టైజూల్, హసన్ మహమ్మద్, లిటన్ దాస్, జకీర్ హుస్సేన్, ముష్ఫికర్. షకీబ్.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Kanpur test will start in a few moments bangla key changes in team india
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com