https://oktelugu.com/

Darshan: ప్రియురాలి కోసం హత్య.. స్టార్ నటుడు అరెస్ట్

కన్నడ చిత్ర సీమలో దర్శన్ అనే స్టార్ నటుడు ఉన్నాడు. ఇతడికి పవిత్ర గౌడ అనే యువతికి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయం కన్నడ చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో షికార్లు చేస్తూనే ఉంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 11, 2024 12:33 pm
    Darshan

    Darshan

    Follow us on

    Darshan: అతడు పేరు పొందిన నటుడు. యూత్ లో అతడికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఫ్లాప్, హిట్ లతో సంబంధం లేకుండా మంచి మార్కెట్ అతడి సొంతం. అలాంటి ఆటగాడు ఓ వివాదంలో చిక్కుకున్నాడు.. తన ప్రియురాలి కోసం హత్య కేసులో ఇరుక్కుని అరెస్టు అయ్యాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే.

    కన్నడ చిత్ర సీమలో దర్శన్ అనే స్టార్ నటుడు ఉన్నాడు. ఇతడికి పవిత్ర గౌడ అనే యువతికి ప్రేమ వ్యవహారం కొనసాగుతోంది. ఈ విషయం కన్నడ చిత్ర పరిశ్రమలో ఎప్పటినుంచో షికార్లు చేస్తూనే ఉంది. పవిత్ర గౌడ కు రేణుకాస్వామి అనే వ్యక్తి కొంతకాలం నుంచి అభ్యంతర మెసేజ్ లు పంపిస్తున్నాడు. ఆమెను భయపెడుతు న్నాడు. ఇదే విషయాన్ని పవిత్ర దర్శన్ కు తెలియజేసింది. దీంతో కోపం తట్టుకోలేని దర్శన్ అతడిని అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఆ ప్లాన్ ప్రకారం రేణుకా స్వామిని కొందరు ఇటీవల హత్య చేశారు. దర్శన్ ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. ఇది కన్నడ చిత్ర పరిశ్రమలో పెద్ద దుమారానికి కారణమైంది. ఈ హత్యకు దర్శన్ కారణం కావడంతో.. కర్ణాటక పోలీసులు మైసూర్ లోని ఫామ్ హౌస్ లో అతడిని అరెస్టు చేశారు.

    దర్శన్ తో పవిత్ర గౌడ కొంతకాలంగా సంబంధం కొనసాగుతోంది. ఆమెకు రేణుకాస్వామి అభ్యంతర కర సందేశాలు పంపిస్తున్నాడనే కారణంతోనే అతడిని హత్య చేశారని ప్రచారం జరుగుతోంది.. రేణుకా స్వామిని బెంగళూరులోని కామాక్షి పాలయలో హత్య చేశారు. దర్శన్ చెప్పినట్టుగానే తాము రేణుకాస్వామిని అరెస్టు చేశామని నలుగురు నిందితులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. హత్య జరుగుతున్నప్పుడు దర్శన్ కూడా అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో దర్శన్ తో సహా పదిమందిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు..

    హత్య ప్రణాళికలో భాగంగా రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. అక్కడ ఒక రేకుల షెడ్డులో ఉంచారు. అతడిని విచక్షణారహితంగా కొట్టారు. రేణుకను కొట్టిన వారిలో దర్శన్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన తర్వాత అతడిని హత్య చేశారని సమాచారం. చంపిన తర్వాత అతడి మృతదేహాన్ని ఒక కల్వర్టులో పడేశారు. కీలక ఆధారాలను లభించిన తర్వాత దర్శన్ ను విజయనగరం ఏసిపి చందన్ బృందం ఆధ్వర్యంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మాత్రమే కాదు దర్శన్ గతంలో చాలా వివాదాలలో చిక్కుకున్నాడు. ఇప్పుడు ఏకంగా హత్య కేసులో ఇరుక్కొని పరువు పోగొట్టుకున్నాడు.