AUS Vs NZ: దురదృష్టం రన్ అవుట్ రూపంలో వెంటాడింది.. పాపం కేన్ మామ.. వైరల్ వీడియో

బౌలింగ్ లో విఫలమైన న్యూజిలాండ్ జట్టు.. బ్యాటింగ్ లోనూ పూర్తిగా నిరాశపరిచింది. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఆ జట్టును ఫిలిప్స్, బ్లండిల్, హెన్రీ ఆదుకున్నారు.

Written By: Neelambaram, Updated On : March 1, 2024 1:48 pm
Follow us on

AUS Vs NZ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో 179 పరుగులకే ఆ జట్టు ఆల్ అవుట్ అయింది. రెండవ రోజు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను ఆల్ అవుట్ చేయడంలో న్యూజిలాండ్ బౌలర్లు విఫలమయ్యారు. చివరి వికెట్ కు గ్రీన్ హజిల్ వుడ్ తో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడంటే ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 383 పరుగులకు తొలి ఇన్నింగ్స్ లో ఆల్ అవుట్ అయింది.

బౌలింగ్ లో విఫలమైన న్యూజిలాండ్ జట్టు.. బ్యాటింగ్ లోనూ పూర్తిగా నిరాశపరిచింది. 29 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ తరుణంలో ఆ జట్టును ఫిలిప్స్, బ్లండిల్, హెన్రీ ఆదుకున్నారు. లేకుంటే న్యూజిలాండ్ 50 పరుగులకే చాప చుట్టేసేది. అయితే న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో అత్యంత బాధాకరమేంటంటే కెన్ విలియంసన్ రన్ అవుట్ కావడం.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

న్యూజిలాండ్ అప్పటికే 12 పరుగులు చేసింది. ఓపెనర్ లాతం వికెట్ కోల్పోయింది. ఈ దశలో వన్ డౌన్ బ్యాటర్ గా క్రీజ్ లోకి కేన్ విలియమ్స్ న్ వచ్చాడు . అతడు ఓపెనర్ యంగ్ తో కలిసి న్యూజిలాండ్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. ఈ దశలో స్టార్క్ వేసిన ఓ బంతిని స్ట్రైట్ కట్ షాట్ ఆడాడు. పరుగుకు రావాలని యంగ్ కు పిలుపునిచ్చాడు. ఈ నేపథ్యంలోనే బంతిని ఫీల్డర్ పట్టుకోవడం.. రన్ తీసే క్రమంలో విలియంసన్, యంగ్ ఒకరిని ఒకరు గుద్దుకోవడం.. విలియంసన్ పరుగు తీసేందుకు ఆలస్యం కావడం.. ఆస్ట్రేలియా ఫీల్డర్ ఆ బంతితో వికెట్లను పడగొట్టడం.. చకచకా జరిగిపోయాయి. దీంతో విలియంసన్ నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు.

అదే స్కోరు వద్ద న్యూజిలాండ్ జట్టు రచిన్ రవీంద్ర వికెట్ కూడా కోల్పోవడం విశేషం. కాగా విలియంసన్ రన్ అవుట్ కావడంతో అతడి అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని చూసిన ఇండియన్ నెటిజన్లు “దురదృష్టం రన్ అవుట్ రూపంలో వెంటాడింది.. పాపం కేన్ మామ” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కేన్ విలియమ్సన్ కు ఇండియాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అతడిని ముద్దుగా కేన్ మామ అని పిలుస్తుంటారు.