https://oktelugu.com/

Kamindu Mendis : క్రికెట్ చరిత్రలో కామిందు మెండిస్ సంచలనం.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రీలంక ఆటగాడు..

శ్రీలంక ఆటగాడు కామిందు మెండిస్ సంచలనాలు సృష్టిస్తున్నాడు. దిగ్గజ ఆటగాళ్లకు సాధ్యం కాని రికార్డులను తన పేరు మీద లిఖించుకుంటున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఔరా అనిపించుకుంటున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 26, 2024 / 09:55 PM IST

    Kamindu Mendis

    Follow us on

    Kamindu Mendis : టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రంలోనే వరుసగా 8 టెస్టులలో 50+ స్కోర్ చేసిన తొలి ప్లేయర్ గా కామిందు మెండిస్ రికార్డు సృష్టించాడు.. న్యూజిలాండ్ జట్టుతో గాలె మైదానం వేదికగా శ్రీలంక జట్టు రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో కామిందు మెండిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. పాకిస్తాన్ ఆటగాడు సౌద్ షకీల్ రికార్డును బద్దలు కొట్టాడు. షకీలా వరుసగా ఏడు టెస్టులలో 50+ స్కోర్ చేశాడు.. ఈ జాబితాలో కామిందు మెండిస్, షకిల్ తర్వాత బెర్ట్ సుత్క్లిఫ్(6), సయీద్ అహ్మద్ (6), బసిల్ బచర్(6), సునీల్ గవాస్కర్ (6) మిగతా స్థానాలలో ఉన్నారు. వీరు మొత్తం ఎంట్రీ నుంచి టెస్టులలో వరుసగా ఆరుసార్లు 50+ పరుగులు చేశారు. కామిందు మెండిస్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. అతడిని భవిష్యత్తు జయసూర్య గా శ్రీలంక అభిమానులు అభివర్ణిస్తున్నారు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడని.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్ఫూర్తిదాయక ఆట తీరు ప్రదర్శిస్తున్నాడని కొనియాడుతున్నారు. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే ఇంకా రాటు తేలుతాడని చెబుతున్నారు. అతడి ప్రతిభను మరింతగా వెలుగులోకి తీసుకురావలసిన అవసరం ఉందని చెబుతున్నారు..

    గురువారం గాలె వేదికగా మొదలైన రెండవ టెస్టులో శ్రీలంక ఆటగాడు దినేష్ చండిమాల్(116), మాథ్యూస్ (78*) కామిందు మెండిస్(51*) అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో శ్రీలంక జట్టు 306 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయి మొదటి రోజు ఈ స్థాయిలో రన్స్ చేసింది. మొత్తంగా రెండో టెస్టులో మొదటి రోజు అప్పర్ హ్యాండ్ సాధించింది. అయితే శ్రీలంక జట్టుకు ప్రారంభంలోనే ప్రతిబంధకం ఎదురైంది. సూపర్ ఫామ్ లో ఉన్న నిస్సాంక (1) సౌథి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ దశలో దినేష్ చండిమాల్ బ్యాటింగ్ కు దిగాడు. మరో ఓపెనర్ కరుణరత్నే(46) తో కలిసి నిదానంగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ రెండవ వికెట్ కు 122 రన్స్ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. కరుణ రత్నే అవుట్ అయినప్పటికీ మాథ్యూస్, చండి మాల్ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. ఈ క్రమంలో చండి మాల్ సెంచరీ చేశాడు. కొద్దిసేపటికి అతడు అవుట్ అయ్యాడు. అనంతరం కామిందు మెండిస్ బ్యాటింగ్ కు వచ్చాడు. వన్డే తరహాలో ఆట తీరును ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.. తద్వారా సూపర్ రికార్డును సాధించాడు.. గత ఎనిమిది టెస్టులలో కామిందు మెండిస్ ఆస్ట్రేలియాపై 61, బంగ్లాదేశ్ పై 102, 164, 92* ఇంగ్లాండ్ పై 113, 74, 64, న్యూజిలాండ్ పై 51*, 50+ పరుగులు చేశాడు. ఈ పరుగుల ద్వారా సరికొత్త రికార్డును సృష్టించాడు.