Bigg Boss Divi: నటి దివి వాద్త్య బిగ్ బాస్ షోతో పాపులారిటీ తెచ్చుకుంది. సీజన్ 4 లో పాల్గొన్న ఈ భామ ఆడియన్స్ ని తన ఆట, అందంతో ఆకట్టుకుంది. అయితే ఆశించిన స్థాయిలో దివి రాణించలేదు. సాధారణంగా బ్యూటిఫుల్ గర్ల్స్ హౌస్లో స్కిన్ షో చేయడం లేదా ఎఫైర్స్ పెట్టుకోవడం చేస్తారు. సెన్సేషన్ క్రియేట్ చేసి షో నిర్వాహకులను, ఆడియన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. దివి ఈ రెండింటికి దూరంగా ఉంది. దివి పద్ధతిగానే బట్టలు ధరించింది. ఇక హౌస్లో దివి అందరితో కలివిడిగా ఉండేది కాదు
కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ తో స్నేహం చేసింది. దివి తక్కువ వారాలకే ఎలిమినేట్ అయ్యింది. అయితే దివి ప్రేక్షకుల మందిలో రిజిస్టర్ అయ్యారు. గతంతో పోల్చితే బిగ్ బాస్ షో తర్వాత ఆమెకు ఫేమ్ దక్కింది. దివికి ఆఫర్స్ పెరిగాయి. వెబ్ సిరీస్లలో ఆమె లీడ్ రోల్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు దక్కుతున్నాయి.
మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా చిత్రంలో దివి నటించింది. ఆమె మూగదైన హీరో ఫ్రెండ్ రోల్ చేసింది. తన మార్కు నటనతో ఆకట్టుకుంది. దివి నెక్స్ట్ పుష్ప 2 లో కనిపించనుంది. అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా విడుదలైన వేర్ ఈజ్ పుష్ప కాన్సెప్ట్ టీజర్లో దివి రిపోర్టర్ గా కనిపించింది. పుష్ప 2 లో ఆమె న్యూస్ రిపోర్టర్ రోల్ చేస్తున్నారని అర్థం అవుతుంది. ఆమె పాత్ర కీలకంగా ఉండే అవకాశం ఉంది.
క్యాబ్ స్టోరీస్, ఏ టి ఎమ్ సిరీస్లలో ఆమె నటించారు. గతంలో దివి చిన్నా చితకా చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ చేసింది. మహేష్ హీరోగా విడుదలైన మహర్షి చిత్రంలో ఆయన క్లాస్ మేట్ రోల్ చేసింది. హీరోయిన్ గా సత్తా చాటాలనే లక్ష్యంతో దివి ముందుకు వెళుతుంది. సోషల్ మీడియాలో అమ్మడు గ్లామర్ విందు చేస్తుంది. తాజాగా ఈ పొడుగు కాళ్ళ సుందరి అరాచకం చేసింది. ప్యాంటు లేకుండా కెమెరా ముందుకు వచ్చింది. థైస్ చూపిస్తూ దారుణమైన వీడియో చేసింది. అది వైరల్ అవుతుంది.