Joe Root: ఈయనేంది ఇలా ఔట్ అయ్యాడు… ఇదేం దిక్కుమాలిన షాట్ రా అయ్యా.. వైరల్ వీడియో…

నిజానికి ఒక షాట్ ని అంచనా వేయడంలో బ్యాట్స్ మెన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అలా ఫెయిల్ అయ్యాడు అంటే బౌలర్ చేతికి దొరికిపోతాడు.అలాగే బాల్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని బౌండర్ గా గానీ, సిక్సర్ గా గానీ మలచవచ్చు అనేది క్రికెట్ దిగ్గజాలు ఎప్పుడు చెబుతూ ఉంటారు.

Written By: Gopi, Updated On : November 8, 2023 6:24 pm

Joe Root

Follow us on

Joe Root: ఒక మ్యాచ్ లో ఎన్ని ఇబ్బందులు ఉన్న ,ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఒక్కసారి ప్లేయర్ బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగాడు అంటే అవంతారాలన్నింటిని ఎదురు కుంటు, పిచ్ అనుకూలించక పోయిన కూడా ఒక వారియర్ లా మారి ప్లేయర్ అద్భుతంగా ఆడాలి టీమ్ ని ముందు ఉండి నడిపించాలి…

ఇక పిచ్ అనుకూలించని టైం లో స్పాట్ లోనే పిచ్ కు సంబంధించిన అన్ని వివరాలు క్లారిటీగా తెలుసుకొని ఆ బౌలర్లు వేసే బాల్ ని ధాటిగా ఎదుర్కోవడానికి సిద్దం గా ఉండాలి. అలా అన్నింటికి సిద్ధమై ఉన్నప్పుడే బౌలర్లను ధాటిగా ఎదుర్కోవడమే కాకుండా టీమ్ కి భారీ స్కోరు ఈజీగా అందించగలుగుతారు.ఇక ఈరోజు ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ అయిన జో రూట్ ఒక వింత షాట్ ఆడటానికి ప్రయత్నం చేసి ఆ క్రమంలోనే బౌల్డ్ అయ్యాడు.ఇక దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

ఇంగ్లాండ్ నెదర్లాండ్స్ టీంల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసింది.ఇక అందులో భాగంగానే ఆ టీం ప్లేయర్ అయిన జో రూట్ మొదట బాగానే పరుగులు చేసి తను మంచి ఫామ్ లో ఉన్నట్టు గా కనిపించినప్పటికీ నెదర్లాండ్స్ బౌలర్ అయిన వన్ బీక్ బౌలింగ్ లో ఒక వింత షాట్ ఆడటానికి ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవ్వడంతో క్లీన్ బోల్డ్ అయిపోయాడు.ఇక ఆ షాట్ కు సంబంధించిన వీడియో నెట్ లో తెగ వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అదేం షాట్ అలా ఆడి అలా బౌల్డ్ అయ్యాడు అంటూ నవ్వుకుంటున్నారు…

నిజానికి ఒక షాట్ ని అంచనా వేయడంలో బ్యాట్స్ మెన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వకూడదు అలా ఫెయిల్ అయ్యాడు అంటే బౌలర్ చేతికి దొరికిపోతాడు.అలాగే బాల్ ని కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయగలిగితే దాన్ని బౌండర్ గా గానీ, సిక్సర్ గా గానీ మలచవచ్చు అనేది క్రికెట్ దిగ్గజాలు ఎప్పుడు చెబుతూ ఉంటారు.ఇక ఇలాంటి డిఫరెంట్ షాట్స్ ని ఇంతకుముందు ఆడిన దిల్షాన్ గానీ, మెక్ కలమ్ కానీ, మహేంద్ర సింగ్ ధోనీ, డివిలియర్స్ , సూర్య కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు డిఫరెంట్ షాట్స్ ని కొడుతూ వాటిని సిక్సర్లు గా మలిచేవారు కానీ జోరూట్ కి ఆ షాట్ ఎలా ఆడాలో తెలియక నెదర్లాండ్స్ బౌలర్ కి దొరికిపోయాడు. ఇక ఈ మ్యాచ్ లో బెన్ స్టోక్స్ సెంచరీ చేసి ఇంగ్లాండ్ టీమ్ కి 339 పరుగుల భారీ స్కోరు ని అందించాడు…

https://x.com/rj_4_all/status/1722216186052845585?s=20