https://oktelugu.com/

Joe Root: సచిన్ రికార్డుకు గురిపెట్టిన జో రూట్.. ఈసారి ఏం చేశాడంటే..

ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ జోరు మామూలుగా లేదు. శ్రీలంకలో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. రెండవ టెస్టులో వరుసగా రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇదే సమయంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ రికార్డుకు గురిపెట్టాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 08:40 AM IST

    Joe Root

    Follow us on

    Joe Root: శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో జో రూట్ అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. తన కెరియర్ లోనే అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. టెస్టులలో టి 20 తరహా బ్యాటింగ్ చేస్తూ అనేక రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుంటున్నాడు. దిగ్గజ ఆటగాళ్ల ఘనతలకు గురిపెట్టి సరికొత్త ధ్రువతారగా అవతరిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు చేసి.. ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కుక్ (33) రికార్డును బద్దలు కొట్టాడు. 34 సెంచరీ ద్వారా ఏకంగా పదో స్థానానికి చేరుకున్నాడు. ఇంకో సెంచరీ చేస్తే ఏకంగా ఆరవ ర్యాంకు సొంతం చేసుకుంటాడు. అదే సమయంలో అత్యధిక సెంచరీలు, పరుగులు చేసిన సచిన్ రికార్డును అధిగమించే దిశగా సాగుతాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ ప్రస్తుతం ఏడవ స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో సచిన్ టెండుల్కర్ ఘనతలను బద్దలు కొడతారా? అనే ప్రశ్నకు రూట్ తనదైన చరిలో సమాధానం చెప్పాడు.

    ” నేను రికార్డులు కొల్లగొట్టేందుకు రాలేదు. నాదైనా ఆటతీరు ప్రదర్శించేందుకు మాత్రమే వచ్చాను. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నా వంతు బాధ్యతలను నిర్వర్తిస్తున్నాను.. జట్టుకు అవసరమైన పరుగులు చేస్తున్నాను. ఏ బ్యాటరైనా స్కోర్ బోర్డుపై తనదైన మార్క్ ప్రదర్శిస్తే బౌలర్లకు ఇబ్బంది ఉండదు. నేను వరుస సెంచరీలు చేశాను కాబట్టి సంతోషంగా ఉన్నాను.. ఈ సమయంలో నాకు ఎదురవుతున్న ప్రశ్నలు ఆమోదయోగ్యమైనవే. కాకపోతే వాటిని రికార్డులకు ముడిపెట్టి అడగడం ఇబ్బందిగా ఉంది. ప్రస్తుతం నా ఆట తీరు వల్ల జట్టు గెలుస్తుందని చెబుతుంటే ఒక రకమైన ఇబ్బందిగా ఉంది. ఎవరి ఆట వారు ఆడితేనే జట్టు గెలుస్తుంది.. ప్రస్తుతం మెరుగైన ఫామ్ కొనసాగిస్తున్నానని భావన నాలో ఉంది. దానిని అలాగే సాగించాలని కోరిక నాలో ఉందని” రూట్ వ్యాఖ్యానించాడు..

    ఇక ప్రస్తుత క్రికెట్లో టెస్ట్ విభాగంలో హైయెస్ట్ సెంచరీలు చేసిన ఘనత సచిన్ టెండూల్కర్ (51) పేరు మీద ఉంది. అతడి రికార్డు బద్దలు కొట్టాలంటే రూట్ ఇంకా 18 సెంచరీలు చేయాలి. ఇక అత్యధిక పరుగుల విషయంలోనూ సచిన్ (15,921) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్ ప్రస్తుతం 12,377 పరుగుల వద్ద ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు అధిగమించాలంటే 3,544 రన్స్ చేయాలి. రూట్ 2021 నుంచి ఇప్పటివరకు 48 టెస్టులు ఆడాడు. ఇందులో 4,544 రన్స్ చేశాడు. ఒకవేళ అతడు ఇదే ఫామ్ కొనసాగిస్తే సచిన్ రికార్డును బ్రేక్ చేయడం పెద్ద విషయం కాకపోవచ్చు. ఇక రూట్ ప్రస్తుతం 33 సంవత్సరాల వద్ద ఉన్నాడు. ఎంత లేదన్నా ఇంకో నాలుగేళ్ల పాటు అతడు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం ఉంది.