https://oktelugu.com/

ind vs aus : కలవరపెడుతున్న బుమ్రా కెప్టెన్సీ రికార్డులు..పెర్త్ టెస్ట్ లోనైనా ఆ అపప్రదకు మంగళం పాడతాడా?

మనం లేచి.. బ్రష్ చేసుకున్న సమయానికి.. శుక్రవారం భారత్ ఆస్ట్రేలియాల మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ మొదలవుతుంది. పెర్త్ వేదికగా ఆక్టస్ స్టేడియంలో రెండు జట్లు తలపడతాయి. టీమిండియా కు కెప్టెన్ గా బుమ్రా వ్యవహరిస్తాడు. ఆస్ట్రేలియాకు పాట్ కమిన్స్ సారథ్యం వహిస్తాడు. వీరిద్దరూ ఫాస్ట్ బౌలర్లే కావడం విశేషం.

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2024 10:16 pm

    ind vs aus

    Follow us on

    ind vs aus టీమిండియా కు కెప్టెన్ గా వ్యవహరించే బుమ్రా రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో వైస్ కెప్టెన్ గా ఉన్న బుమ్రా కెప్టెన్ అయ్యాడు. అయితే బుమ్రా గతంలో కెప్టెన్ గా వ్యవహరించాడు. 2022లో బర్మింగ్ హం వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడింది. ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు నాటి కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు నిర్ణీత సమయంలో కోలుకోలేదు. ఫలితంగా బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాల్సి వచ్చింది. ఆ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ ఎదుట 378 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.. అయితే ఆ టార్గెట్ ను ఇంగ్లాండ్ ఆటగాళ్లు జో రూట్, జానీ బెయిర్ స్టో చేదించారు. వారిద్దరు సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు. ఫలితంగా భారత్ ఓడిపోవలసి వచ్చింది. బుమ్రా నాయకత్వం వహించిన తొలి టెస్ట్ లో భారత్ ఓడిపోవడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.. ఇక టీమిండియాలో ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్ కావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కపిల్ దేవ్ 1987లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.. ఇక ఆ తర్వాత ఆ ఘనత అందుకున్న ఆటగాడిగా బుమ్రా నిలిచాడు.. టెస్ట్ క్రికెట్ ను కాస్త పక్కన పెడితే.. టి20 సిరీస్లో భారత జట్టుకు బుమ్రా నాయకత్వం వహించాడు. 2023లో ఐర్లాండ్ దేశంలో భారత్ పర్యటించింది. మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది. ఆ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లను భారత్ గెలిచింది. చివరి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరిగే తొలి టెస్ట్ ద్వారా అన్ని ఫార్మాట్లలో బుమ్రాకు ఇది ఓవరాల్ గా ఐదవ మ్యాచ్. భారత జట్టుకు కెప్టెన్ గా బుమ్రా నాలుగు మ్యాచ్ లకు నాయకత్వం వహించాడు. రెండు మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. ఒక దాంట్లో ఓడిపోయింది. మరొక దాంట్లో ఫలితం తేలలేదు.

    ఆస్ట్రేలియాపై ఘనమైన రికార్డు

    కెప్టెన్ గా బుమ్రా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టుపై మాత్రం అతడికి అద్భుతమైన రికార్డు ఉంది.. బుమ్రా ఇప్పటివరకు ఆస్ట్రేలియా పై 7 మ్యాచులు ఆడాడు. ఏకంగా 34 బికెట్లు పడగొట్టాడు. అతడి సగటు 21.25 అంటే బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018లో మేల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుతమైన ప్రదర్శన ద్వారా టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్ లో బుమ్రా కనుక స్టార్టింగ్ ఓవర్లలో వికెట్లు సాధిస్తే.. టీమిండియాకు తిరుగుండదని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. కెప్టెన్ గా అతడు వ్యవహరించేది ఒక మ్యాచ్చే కాబట్టి.. పెద్దగా ఇబ్బంది ఉండదని.. కచ్చితంగా అతడు తన కంబ్యాక్ ఇచ్చేస్తే టీమిండియా తిరుగులేని స్థాయిలో ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తాయి.. మరోవైపు పెర్త్ మైదానాన్ని పేస్ బౌలర్లకు అనుకూలంగా రూపొందిస్తే ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి.. బ్యాటర్లకు ఇబ్బందులు లేకుండా చూస్తూనే.. వైవిధ్యమైన వికెట్ గా రూపొందించినట్టు తెలుస్తోంది.